గాంధీ ఆశ‌యాల సాధ‌న‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కృషి

మంత్రి అవంతి శ్రీనివాస్

విశాఖపట్నం:  మ‌హాత్మాగాంధీ ఆశ‌యాల సాధ‌న‌కు ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కృషి చేస్తున్నార‌ని మంత్రి అవంతి శ్రీ‌నివాస్ పేర్కొన్నారు. విశాఖ‌లోని వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్ర పటానికి మంత్రి అవంతి శ్రీనివాస్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం  మంత్రి అవంతి శ్రీ‌నివాస్ మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశ ఆత్మ, మహానేత జాతిపిత మహాత్మాగాంధీ మానవాళి ఉన్నంత వరకు గాంధీ పేరు చిరస్థాయిగా ఉంటుందని అన్నారు. జాతిని ఎకతాటిపై నడిపిన వ్యక్తి గాంధీ అని ఆయన అన్నారు. గాంధీ మార్గాన్ని అందరు అనుసరించాలి. అప్పుడే గాంధీకి ఘనమైన నివాళని చెప్పారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top