20న టూరిజం నూత‌న పాల‌సీ ప్రారంభం

సెప్టెంబ‌ర్ మొద‌టివారంలో ప‌ర్యాట‌క ప్రాంతాల్లో సంద‌ర్శ‌కుల‌కు అనుమ‌తి

ప‌ర్యాట‌క శాఖ మంత్రి అవంతి శ్రీ‌నివాస్‌

స‌చివాల‌యం: సెప్టెంబ‌ర్ మొద‌టివారంలో ప‌ర్యాట‌క ప్రాంతాల్లో సంద‌ర్శ‌కుల‌కు అనుమ‌తిస్తామ‌ని ప‌ర్యాట‌క శాఖ మంత్రి అవంతి శ్రీ‌నివాస్ తెలిపారు. అంతేకాకుండా ఈనెల 20న ప‌ర్యాట‌క నూత‌న పాల‌సీని సీఎం వైయ‌స్‌ జ‌గ‌న్ ప్రారంభిస్తారని తెలిపారు. సచివాలయంలో టూరిజం, స్పోర్ట్సు, కల్చరల్, ఆర్కియాలజీ అధికారులతో మంత్రి అవంతి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. అనంత‌రం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. త్వ‌ర‌లో సింహాచ‌లం దేవ‌స్థానంలో `ప్ర‌సాద్‌` ప‌థ‌కం ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నామ‌న్నారు. కొండ‌ప‌ల్లి ఫోర్ట్, బాపు మ్యూజియంల‌ను సీఎం వైయ‌స్‌ జ‌గ‌న్ ప్రారంభిస్తారని, తొట్ల‌కొండ‌లో బుద్ధిస్ట్ మ్యూజియం, మెడిటేష‌న్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. జాతీయ స్థాయిలో ప‌త‌కాలు సాధించిన క్రీడాకారుల‌కు వైయ‌స్ఆర్ క్రీడా పుర‌స్కారాలు అంద‌జేస్తామ‌న్నారు. పీపీఈ ప‌ద్ధ‌తిలో రాష్ట్రంలో మూడు ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియాలు ఏర్పాటు చేస్తామ‌న్నారు.

Back to Top