వెలగపూడి: పేద ప్రజల దేవుడు దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. గవర్నర్ ప్రసంగంతో మళ్లీ వైయస్‌ఆర్ గుర్తుకువచ్చారన్నారు. గవర్నర్ ప్రసంగం రాష్ట్ర ప్రభుత్వ ఆశలు ప్రతిబింబించేలా ఉందన్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగం అనంతరం మంత్రి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్డీతలా భావిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పొందుపర్చిన అంశాలను తూచా తప్పకుండా అ మలు చేస్తామని నిరూపించుకుంటున్నారన్నారు. మళ్లీ మహానేత వైయస్‌ఆర్ గుర్తుకు వచ్చే విధంగా పేదల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గత చంద్రబాబు పాలనలో కేవలం ధనవంతులు మాత్రమే సంతోషంగా ఉండేవారని, కానీ, ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనలో పేదలంతా సంతోషంగా ఉంటారన్నారు.