ఎన్ని ఇబ్బందులు వచ్చినా పోలవరం ప్రాజెక్టు పనులు ఆపలేదు

మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

వైయస్‌ఆర్‌ హయాంలో 75 శాతం భూ సేకరణ జరిగింది

2016 వరకు టీడీపీ ప్రభుత్వం పోలవరంపై దృష్టిసారించలేదు

చంద్రబాబు భజనకే రూ.100 కోట్లు ఖర్చు చేశారు

చంద్రబాబుకు చిత్తశుద్ధి లేకపోవడంతో ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది

ప్రాజెక్టులో 48కి 48 గేట్లు పూర్తి చేసింది వైయస్‌ జగన్‌ ప్రభుత్వమే

స్పిల్‌వే రోడ్డు వేసింది ఈ ప్రభుత్వమే

అమరావతి: ఎన్ని ఇబ్బందులు వచ్చినా పోలవరం ప్రాజెక్టు పనులను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆపలేదని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ తెలిపారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి లేకపోవడంతో రాష్ట్ర ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చచిందన్నారు.  చంద్రబాబు హయాంలో ప్లానింగ్‌ లేకుండా అడ్డదిడ్డంగా పనులు చేపట్టడంతో నష్టపోవాల్సి వచ్చిందన్నారు. బాబు భజనకే రూ.100 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక రివైర్స్‌ టెండరింగ్‌ ద్వారా ప్రజాధనాన్ని ఆదా చేశామని చెప్పారు. ప్రచార ఆర్భాటాలు లేకుండా మా ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అభివృద్ధిని శాసన సభలో మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ వివరించారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 75 శాతం భూసేకరణ జరిగింది. 2016 వరకు పోలవరం గురించి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆర్‌ఆండ్‌ఆర్‌ మార్పులు, డిజైన్‌మార్పుల గురించి ఎక్కడా ప్రస్తావించకుండా మౌనంగా ఉన్నారు. సవరించిన అంచనాలు కేంద్రం అడిగితే ఆనాటి టీడీపీ ప్రభుత్వం తాత్కారం చేసింది. సడన్‌గా ఒకరోజు 2016 సెప్టెంబర్‌ 30న కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ ఓ ప్యాకేజీని విడుదల చేశారు. ఆ ప్రకటనలో అరుణ్‌జైట్లీ చెప్పిందేంటంటే..రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు వారికే అప్పగిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ రోజు పోలవరం ప్రాజెక్టుకు ఎదురవుతున్న సమస్యలన్నింటికీ ఆ రోజు కేంద్ర మంత్రి ఇచ్చిన ప్రకటనే కారణం. 2017 మార్చిన కేంద్రం ఇచ్చిన మెమోను కోట్‌ చేస్తూ కేబినెట్‌లో ఆమోదం తెలిపారు. అప్పట్లో టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. 2014కు ముందు రివైజ్డ్‌ ఎస్టిమేషన్‌ రూ.16 వేల కోట్లకు పెంచారో అంతవరకు మాత్రమే ఇస్తామని కేంద్రం చెప్పింది. ఆర్‌అండ్‌ఆర్‌ కూడా పెంచి ఇవ్వమని కేబినెట్లో తీర్మానించారు.  టీడీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఉంటే 1.05 లక్షల కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్‌ ఇవ్వాలని ఆ నాటి కేబినెట్లో పెట్టి ఉంటే ఈ రోజు ఎలాంటి సమస్య ఉండేది కాదు.ఆ రోజు టీడీపీ ప్రభుత్వం రాత్రికి రాత్రి ప్రెస్‌మీట్లు పెట్టి బ్రహ్మండమైన ప్యాకేజీ వచ్చిందని సంకలు కొట్టుకున్నారు. ఈ రోజు దాదాపు రూ.55 వేల కోట్లు ఖర్చు అవుతుంది. అక్కడున్న దళిత, గిరిజనులకు శాపంగా మారింది. పోలవరం ప్రాజెక్టు నుంచి లబ్ధి పొందాలని టీడీపీ ప్రయత్నం చేసింది. టీడీపీ చేసిన తప్పుల వల్ల రాష్ట్రం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. అప్పట్లో చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు. 50 శాతం పనులు పూర్తి అయ్యాయని చెప్పారు. వాళ్ల కేబినెట్‌లో పెట్టిన నోట్‌ను అప్రూవల్‌ ఇవ్వాలని చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు. ఇన్ని చేసిన తరువాత ఈ రోజు మేమే పోలవరం డ్యామ్‌ నిర్మించామని అబద్ధాలు చెబుతున్నారు. నామినేషన్‌ పద్దతిలో ఆ రోజు పనులు పంచి పెట్టారు. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక ప్రతిది రివైర్స్‌ టెండరింగ్‌ తీసుకువచ్చారు. లెప్ట్‌ కెనాల్‌కు సంబంధించి పోలవరం పనులను మొట్టమొదటిసారిగా రివైర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.56 కోట్ల ప్రజాదనాన్ని మిగిలించాం. ఆ తరువాత పోలవరం రివైర్స్‌ టెండరింగ్‌ వేసి రూ.830 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిది. 
పోలవరం డ్యామ్‌కు సంబంధించి దాదాపు 53 మీటర్లు లెవల్‌ ఉండాలి. చంద్రబాబు హయాంలో ఒక్క పీయర్‌ కూడా నిర్మించలేదు. ఒక ప్రాజెక్టుకు ఒక శంకుస్థాపన ఉంటుంది. కానీ చంద్రబాబు హయాంలో ఐదారు శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. గేటు పెట్టి దానికి శిలాఫలకం నిర్మించారు. కేవలం ప్రచారం కోసం రూ.100 కోట్లు గత ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎక్కడా ఆర్భాటాలు లేకుండా పనులు చేపడుతున్నాం. ఎన్ని ఇబ్బందులైన కూడా చిత్తశుద్ధితో ముందుకు వెళ్తోంది. 2019 నవంబర్‌లో పోలవరాన్ని తీసుకొని అన్ని స్పిల్‌వేలు, 48 గేట్లు అమర్చింది ఈ ప్రభుత్వమే. కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేసింది ఈ ప్రభుత్వమే. ఈసీఆర్‌డ్యామ్‌ను పూర్తి చేసింది ఈ ప్రభుత్వమే. ఆ తరువాత అప్రూవల్‌ చానల్‌ డైవర్ట్‌ చేసి  స్పిల్‌ చానల్‌ నుంచి 10 రివర్స్‌ స్లూయిస్‌ గేట్ల నుంచి నీరు ఇచ్చింది ఈ ప్రభుత్వమే. 
నవంబర్‌ నుంచి జూన్‌ వరకు ఆరు, ఏడు నెలలు మాత్రమే పనులు జరుగుతాయి. మన ప్రభుత్వం వచ్చిన తరువాత కోవిడ్‌ ఏవిధంగా ఇబ్బందిపెట్టిందో అందరికీ తెలుసు. రెండు మేజర్‌ వర్కింగ్‌ సీజన్లు కోవిడ్‌తో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రాజెక్టు వద్దే 3 వేల మందితో క్యాపింగ్‌ ఏర్పాటు చేసి, డాక్టర్లను నియమించి ఎంతో జాగ్రత్తగా ప్రాజెక్టుపనులు చేపట్టాం. జర్మని నుంచి సిలిండర్లు తెచ్చుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎయిర్‌ లిప్ట్‌ చేయమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.   టీడీపీ నేతలు కోవిడ్‌ సమయంలో హైదరాబాద్‌కు, ఇళ్లకు పరిమితమయ్యారు. కేవలం జూమ్‌ల్లో మాట్లాడారు. మా ప్రభుత్వంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కోవిడ్‌ను సైతం లెక్కచేయకుండా పని చేశారు. కోవిడ్‌ సమయంలో పోలవరం వద్ద ఏఈలను, డీఈలను, కొంత మంది సిబ్బందిని కోల్పోయాం. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  పోలవరంపై చిత్తశుద్ధితో ఇబ్బందులను అధిగమిస్తూ పనులు పూర్తి చేయిస్తున్నారు. 
రాజు మంచివాడు, మనసున్న వాడు అయితే ప్రకృతి కూడా సహకరిస్తుందన్న నానుడి ఉంటుంది. అప్పట్లో వైయస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వర్షాలు సమృద్ధిగా కురిశాయి. చంద్రబాబు సీఎం అయ్యాక మళ్లీ రాష్ట్రం కరువు కాటకాలతో అల్లాడిపోయింది. ఆ తరువాత వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక మళ్లీ వరణుడు కరుణించాడు. 2019లో గోదావరిలో 13.95 లక్షల క్యూసెక్కుల వరద, 2020, 2021లో 23 లక్షల క్యూసెక్కుల వరద, 2022లో దాదాపు 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. వరదల సమయంలో ఎంత చిత్తశుద్ధితో నిర్మించామో ప్రజలకు వివరిస్తునానం. ప్రాజెక్టు నిర్మించే సమయంలో స్పిల్‌వే, డ్యామ్‌ వేరు వేరుగా ఉంటాయి. ఇక్కడ స్పిల్‌వేను నిర్మించి నీటిని మళ్లించాల్సి ఉంటుంది. ఆ తరువాత డ్యామ్‌ను నిర్మించాలి. కానీ చంద్రబాబు ఏం చేశారంటే కాఫర్‌ డ్యామ్‌ను నిర్మించి, అక్కడ ఉన్న ఇళ్లను ముంచేశారు. అన్ని కూడా అసంపూర్తిగా నిర్మించి వదిలేశారు. మన ప్రభుత్వం వచ్చాక స్పీల్‌వే నిర్మించి, ఆ తరువాత డ్యామ్‌ నిర్మిస్తున్నాం. వీళ్ల తప్పిదం వల్ల 22 లక్షల వరదను చూడాల్సి వచ్చింది. రెండు కిలోమీటర్లలో పోవాల్సిన నది వీళ్ల తప్పిదం వల్ల నష్టం జరిగిందని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ తెలిపారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top