పవన్‌ది లాంగ్‌ మార్చా..? రాంగ్‌ మార్చా?

మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌

చంద్రబాబు ఐదేళ్ల పాలనంతా కరువే

సీఎం వైయస్‌ జగన్‌ పాలన చూసి మానసిక వ్యథతో బాధపడుతున్న బాబు

బాబు డైరెక్షన్‌లో పని చేస్తున్న పవన్‌ 

తాడేపల్లి: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ నెల 3వ తేదీ విశాఖలో చేస్తున్నది లాంగ్‌ మార్చా? రాంగ్‌ మార్చా అని  ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ ప్రశ్నించారు. ఉనికి కోసమే పవన్‌ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్ల చంద్రబాబు పాలన అంతా కరవు ఉండేదని పేర్కొన్నారు.వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే 86 శాతం రిజర్వాయర్లు నిండాయని తెలిపారు. ఐదేళ్లు ఇసుక మాఫియాగా రాష్ట్రాన్ని దోచుకున్నదెవరో అందరికి తెలుసు అన్నారు. అందుకే చంద్రబాబుకు ప్రజలు 23 సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతులు సహా అందరూ సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పవన్‌ కళ్యాణ్‌ లాంగ్‌ మార్చ్‌ చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు హయాంలో ఎక్కడైనా ఒక్క ఇసుక లారీని సీజ్‌ చేశారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాలన పారదర్శకంగా నడుస్తుంటే ఓర్వలేకున్నారని ధ్వజమెత్తారు. సీఎం వైయస్‌ జగన్‌ పాలన చూసి మానసిక వ్యథతో చంద్రబాబు బాధపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌ అని వ్యాఖ్యానించారు. బాబు డైరెక్షన్‌లో పవన్‌ పని చేస్తున్నారని పేర్కొన్నారు. నీచ రాజకీయాలు మానుకోవాలని చంద్రబాబు, పవన్‌లకు మంత్రి అనిల్‌ సలహా ఇచ్చారు. డ్రామా ఆర్టీస్టులతో చంద్రబాబు రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. 

Read Also:18 అవినీతి కేసుల్లో స్టేలు తెచ్చుకుని సుమతి శతకాలా?

తాజా ఫోటోలు

Back to Top