ఇకనైనా డ్రామాలు ఆపండి..ప్రభుత్వ విధులను అడ్డుకోవద్దు

 మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌

ముంపు ప్రాంతాల్లో ప్రజల రక్షణ ప్రభుత్వ బాధ్యత

అమరావతి: కరకట్టపై ఉన్న ఇల్లు తనది కాదని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు నాదని ఎలా అంటారని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రశ్నించారు. ఆ ఇల్లు లింగమనేని రమేష్‌ది అన్న చంద్రబాబు ఇప్పుడు మాట్లాడటం ఏంటని నిలదీశారు.  ఇకనైనా టీడీపీ నేతలు డ్రామాలు  ఆపి ప్రభుత్వ విధులను అడ్డుకోవద్దని హితవు పలికారు.  కరకట్ట మీద ఉన్న నివాసం తనది కాదని చెప్పిన చంద్రబాబు ఇల్లు మునిగిపోతున్న విషయం ప్రపంచానికి తెలియకూడదని ఆయన ఆరాటపడుతున్నారన్నారు. తాను చేసిన తప్పుడు పనులు ప్రజలకు తెలియనీవ్వకుండా  చంద్రబాబు అడ్డుకోవడం లేదా అని ప్రశ్నించారు. వరద వస్తే బాలు ఇల్లు మునిగిపోతుందని ఎప్పుడో చెప్పామని తెలిపారు. ముంపు ప్రాంతాల్లో ప్రజల రక్షణ ప్రభుత్వ బాధ్యత అన్నారు. ప్రకాశం బ్యారేజికి మరింత వరద వచ్చే అవకాశం ఉందని, వరద పరిస్థితిని అంచనా వేసేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నట్లు చెప్పారు.గత మూడు రోజులుగా డ్రోన్లను వినియోగిస్తూనే ఉన్నామని వివరించారు. ఇరిగేషన్‌ శాఖ అనుమతి, ఆదేశాలతోనే డ్రోన్ల వినియోగం జరిగిందని మంత్రి చెప్పారు. 

తాజా ఫోటోలు

Back to Top