అమరావతిఃగవర్నర్ ప్రసంగం రోటిన్‌గా లేకుండా భిన్నంగా ఉందని డిప్యూటీ సీఎం,మైనారీటీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా అన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికి నీతివంతమైన, పారదర్శక పాలన వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అందిస్తుందని చెప్పడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. దేశం,రాష్ట్రాల్లో అవినీతి పెరిగిపోయింందని..ఇలాంటి తరుణంలో సూర్యకిరణంగా,అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పడం స్వాగతిస్తున్నామన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించే దిశలో సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి అడుగు వేశారన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం జీవో ద్వారా సీబీఐని రాష్ట్రంలోకి రాకూడ చేయడం దారుణమన్నారు. సీఎం జగన్ మొదటి నిర్ణయం ద్వారా సీబీఐ వ్యవస్థను రాష్ట్రంలో పునర్వివ్యవస్థీకరించడం జరిగిందన్నారు.అవినీతి జరిగితే సిబీఐ ద్వారా విచారణ జరిపిస్తామని తెలిపారు.