వైయ‌స్ జగన్‌ లాంటి ఏనుగు వెళ్తుంటే పవన్‌ లాంటి కుక్కలు మొరుగుతుంటాయి

మంత్రి అంబటి రాంబాబు

పవన్‌ కల్యాణ్‌ది పక్కా ప్యాకేజీ రాజకీయమే

పవన్ కల్యాణ్ ఇంత వరకూ ఎన్నికల్లో గెలవనేలేదు

కలిసి వచ్చినా.. మీకు రాజకీయ మరణమే

ప‌ల్నాడు:  వైయ‌స్ జగన్‌ లాంటి ఏనుగు వెళ్తుంటే పవన్‌ లాంటి కుక్కలు మొరుగుతుంటాయి అని మంత్రి అంబ‌టి రాంబాబు మండిపడ్డారు. పవన్‌ కల్యాణ్‌ది పక్కా ప్యాకేజీ రాజకీయమేన‌ని మంత్రి విమ‌ర్శించారు. తెలుగు రాజకీయాల్లో ఆయ‌న ఓ కామెడీ పీస్‌ అని ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. నా అంత సంస్కారవంతమైన నాయకుడు లేడని అంటాడు, మంత్రులను దూషిస్తాడు. పవన్‌ది అసలు నోరేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయ‌స్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత పవన్‌కు ఉందా అని ప్రశ్నించారు.  

 
వంకలు ఎందుకు?:
    జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి సభలో చాలా విషయాలు మాట్లాడారు. అదే సమయంలో ఒక విషయం స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే శక్తి తనకు లేదని, అందుకే చంద్రబాబు తోడు కావాలని చాలా క్లియర్‌గా చెప్పారు. అలా చెప్పి ఊర్కుంటే మంచిదే. కానీ ఇంకా ఏమంటున్నాడు. నేను పిరికివాణ్ని కాదు. నేను చాలా ధైర్యవంతుడిని. దేన్నీ లెక్క చేయను. కానీ జగన్‌మోహన్‌రెడ్డిగారి మీదకు మాత్రం ఒంటరిగా వెళ్లలేను. ఎవరి తోడైనా ఉంటేనే వెళ్లగలుగుతాను అంటున్నాడు. అందుకే మీరు మాట్లాడిన వీడియో మరోసారి చూడండి. మీరు ధైర్యవంతులో.. లేక పిరికివారో అన్న విషయం మీకే అర్ధమవుతుంది. దానికి ఎందుకు వంకలు వెతుక్కుంటున్నారు?

ఎలాగైనా మీకు అది తప్పదు:
    సింగిల్‌గా వెళ్లి తాను వీర మరణం పొందలేనని పవన్‌ చెబుతున్నారు. నీవు ఏమైనా యుద్ధానికి వెళ్తున్నావా? ఎన్నికలకు వెళ్తున్నావు. దానికి అంత గొప్ప పేరెందుకు? అసలు నీకు ఇంత వరకు రాజకీయాల్లో జన్మ లేదు. నీవు పార్టీ పెట్టావు. కానీ ఒక్కసారి కూడా గెలవలేదు. అంటే నీకు ఇప్పటి వరకు జన్మ అనేదే లేదు. అలాంటప్పుడు మరణం ఏమిటి? దానికి అంత పేరెందుకు? పుస్తకాల్లో చదివి గొప్ప గొప్ప పదాలు వాడినంత మాత్రాన మీరు గొప్ప నాయకుడు కారు.
    జగన్‌గారిపై మీరు సింగిల్‌గా వెళ్తే వీర మరణం చెందుతానని అన్నాడు. మరి చంద్రబాబు పరిస్థితి కూడా అదే కదా? అంటే మీరిద్దరూ సింగిల్‌గా ఎన్నికలకు వెళ్తే.. ఢామ్‌ అని అర్థమైంది కదా? ఇక్కడ మరో విషయం కూడా చెబుతున్నాను. మీరిద్దరూ కలిసి వచ్చినా మీకు మరణం తప్పదు. ఇది వాస్తవం. ప్రజలకు కూడా తెలుసు. వారికి అన్నీ అర్ధమయ్యాయి.

యూ ఆర్‌ ఎ కామెడీ పీస్‌:
    మమ్మల్ని సభలో పవన్‌ చాలా దూషించాడు. తనంతటి సంస్కారవంతుడైన నాయకుడు రాజకీయాల్లో లేనే లేడని అంటాడు. కానీ ఏరా.. పోరా.. తురే.. అరేయ్‌..అనే పదాలు వాడతాడు. ధైర్యం ఉందంటాడు. కానీ ఒక్కణ్నే వెళ్లలేనని అంటాడు. ఏమిటా పొంతన లేని మాటలు. 
    ఇంకో మాట కూడా అన్నాడు. తనకు గ్యారెంటీ ఇస్తే, ఒంటరిగా పోటీ చేస్తానని. పోయినసారి నా సభలకు ఇలాగే చాలా మంది వచ్చారు. కానీ ఓటేయలేదని అన్నాడు. అంటే దానర్థం సభల్లో నీ కామెడీ చూడడానికి వస్తున్నారు. చూసి వెళ్లిపోతున్నారు. ఓట్లు మాత్రం జగన్‌గారికి వేస్తున్నారు. 
    అంటే ‘యు ఆర్‌ ఎ కామెడీ పీస్‌ ఇన్‌ తెలుగు పాలిటిక్స్‌’. పవన్‌ కళ్యాణ్‌ ఈజ్‌ ఎ కామెడీ పీస్‌ ఇన్‌ తెలుగు పాలిటిక్స్‌ అనేది చక్కగా అర్ధమైంది. నిన్ను, నీ కామెడీ చూడడానికి సభకు వస్తున్నారు. నీ మాటలు విని నవ్వుకుంటున్నారు. వెళ్లిపోతున్నారు. ఓట్లు మాత్రం జగన్‌గారికి వేస్తున్నారు.

గొంతు పిసికి చంపేస్తావా?:
    ఇంకా నన్ను, మరో మంత్రి అమర్‌నాథ్‌తో పాటు, రోజాపైనా పవన్‌ ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారు. ఏమిటా మాటలు? నీదసలు నోరేనా? నీకు సంస్కారం ఉందా?
    నిన్ను ప్యాకేజీ స్టార్‌ అంటే ఒప్పుకోనంటున్నావు. ఆ మాట అంటే సహించను. నా చేతి అందుబాటులోకి వచ్చి, ఆ మాట అంటే నేనేమిటో చూపిస్తాను అంటున్నావు. అంటే గొంతు పిసికి చంపేస్తావా? ఒక పని చేయండి. నీవు, నీ అన్న నాగబాబు.. మమ్మల్ని అందరినీ భోజనానికి పిల్చి, విషం పెట్టి చంపండి.

ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి:
    పిరికి సన్నాసుల్లారా. పోరాడే దమ్ము, ధైర్యం లేక.. మంచి విమర్శలు చేసి, వాస్తవాలు చెబుతుంటే భరించలేక పిచ్చి విమర్శలు చేస్తున్నారు. మీరు ఏమిటయ్యా పోరాటం చేసింది?.
    రాజశేఖర్‌రెడ్డిగారి మీద ఒక డైలాగ్‌ అంటే, పోరాడినట్లా. పంచెలూడదీసి తరిమి కొట్టండి అని పారిపోయావు. అది పోరాడినట్లా?
బజార్లో ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతాయి. రాజశేఖర్‌రెడ్డిగారు, జగన్‌గారు ఏనుగు వంటి వారు. వారు వెళ్తుంటే నీ వంటి కుక్కలు మొరుగుతాయి. నీకు ఆరాటం తప్ప, నీకు పోరాటం తెలియదు.

గౌరవం అంటే...:
    పవన్‌ ఇంకో మాట కూడా అన్నారు. తాను కలిసే పోటీ చేస్తానని. ఓట్లు చీలబోనివ్వనని. తన గౌరవం తగ్గొద్దని. నా గౌరవానికి తగ్గట్లుగా ఉండాలి. ఏమిటో గౌరవం అంటే..
    ఒక పాత సినిమా పాట ఉంది. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని. అలాగే పవన్‌కళ్యాణ్‌ మాటలకు కూడా ఒక అర్థం ఉంది. గౌరవం అంటే ఏమిటి? గౌరవం అంటే ప్యాకేజీ. గౌరవం అంటే బరువు. తగినంత గౌరవం ఇస్తే కలిసి పోటీ చేస్తాను. అది లేకపోతే సింగిల్‌గా పోటీ చేసి వీర మరణం పొందుతాను అని. సింగిల్‌గా పోటీ చేయలేవు. కలిసి పోటీ అంటావు. గౌరవం అంటావు.

ప్రజల విశ్వాసం పొందకుండా..:
    పైగా ప్రజలు గ్యారెంటీ ఇవ్వాలట. వారు గెలిపిస్తానని గ్యారెంటీ కార్డు ఇస్తే, సింగిల్‌గా పోటీ చేస్తావా? నీవు ఆయనను (చంద్రబాబు) కలిశావు. ఆయన గ్యారెంటీ ఇచ్చాడా? ఆయనకే గ్యారెంటీ లేదు. 
గ్యారెంటీ కార్డు వెతుక్కునే స్థితిలో జనసేన ఉంది. కష్టం వచ్చింది అంటున్నావు. మరి పార్టీ ఎందుకు పెట్టావు. నాకు కష్టం వచ్చింది. మీరు ఓటేయడం లేదని ప్రజలను అంటున్నావు. అలా అంటే ఓటేస్తారా?
    నీవు ప్రజల విశ్వాసాన్ని పొందిన రోజున, నీవు సీఎం అయితే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన రోజున నీకు ఓటేస్తారు. కానీ ఆ నమ్మకం ప్రజల్లో కలిగించకుండా.. పిచ్చి పిచ్చిగా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నాడు.

మాకూ సైనికులు ఉన్నారు:
    ఏమన్నాడు. ప్యాకేజీ స్టార్‌ అంటే చెప్పు తీసుకుని కొడతావా? మాకు చెప్పులు లేవా? కనీసం ఇంగిత జ్ఞానం లేదు. రాజకీయాల్లో సద్విమర్శలు చేయాలి. మేము మళ్లీ చెబుతున్నాం. నీవు ప్యాకేజీ తీసుకునే రాజకీయం చేస్తున్నావు. అది స్పష్టంగా కనిపిస్తోంది. ఇది వాస్తవం. ఆ మాట అంటే ఊర్కోను. చెప్పుతో కొడతాను అంటున్నావు. మరి మా పార్టీకి కూడా సైనికులు, మహిళలు లేరా? నీకే ఉన్నారా? కానీ నీవు వారిని రెచ్చగొడుతున్నావు.
    కష్టం, నష్టం వచ్చినా రాజకీయాల్లో ధైర్యంగా నిలబడాలి. జగన్‌గారు తన తండ్రి చనిపోయిన తర్వాత ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. అన్యాయంగా జైలులో పెట్టినా, ధైర్యం కోల్పోలేదు. ఏనాడూ ప్రజలను ఓట్ల కోసం గ్యారెంటీ అడగలేదు. వారితో మమేకం అయ్యారు. అంతులేని విశ్వాసం పొందారు. అఖండ విజయం సాధించారు.

మీకే మాత్రం నైతిక హక్కు లేదు:
    జగన్‌గారిని మరో మాట అన్నావు. మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటున్నావు. అసలు ఆయన గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు.. నీ అన్న నాగబాబుకు ఉందా? జగన్‌గారి వ్యక్తిత్వం ఎక్కడ? ఏ మాత్రం విలువలేని నీ వ్యక్తిత్వం ఎక్కడ? ఇద్దరి మధ్య ఎక్కడైనా పోలిక ఉందా?
మూడు ముక్కలు, మూడు ముళ్ల గురించి మాట్లాడే నైతికత నీకున్నదా? 

కొత్త సంస్కృతికి తెర ఎత్తారు:
    నీకు, నీ అన్న నాగబాబుకు ఉన్న అర్హత ఏమిటి? సినిమా వ్యామోహంతో మీ వెంట పడుతున్న అమాయకులను నట్టేట ముంచడానికి పెట్టిన రాజకీయ పక్షమే మీ పార్టీ. అలాగే చంద్రబాబునాయుడు చంక ఎక్కడానికి, ఆయన వెంట తిరగడానికి, చంద్రబాబునాయుడుకు ఆపద వచ్చినప్పుడు రక్షించుకోవడానికి, పార్టీ పెట్టిన మీరు.. సంప్రదాయాలకు భిన్నంగా బూతులు తిట్టడం. చెప్పులు తీసి చూపడం. కొత్త సంస్కృతికి తెర తీశారు. మీకు కామన్‌సెన్స్‌ లేదు. నైతికత అంత కంటే లేదు.

మీది ప్యాకేజీ ఆరాటం:
    మీ మాటలు వింటే మేము భయపడతామా? మీరు పిచ్చోళ్లు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని విమర్శిస్తున్నారంటే.. అది బలం అని మీరు అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి వారు మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారు. అది విషయం. మీరు చేస్తున్న కార్యక్రమాలను ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారు. ఎందుకంటే మీకు నైతికత లేదు. మీలో చిత్తశుద్ది లేదు. మీ దగ్గర సరుకు లేదు. రాజకీయాల పట్ల అవగాహన లేదు. రాజకీయాలు చేయాలన్న ఉద్దేశం లేదు. అధికారం పొందాలన్న తాపత్రయం లేదు. అమ్ముడు పోవాలని, ప్యాకేజీ తీసుకోవాలన్న ఆరాటం తప్ప.. ఇలాంటి చీడ పురుగులకు రాష్ట్రంలో ప్రజలు ఏనాడూ ఓటేయబోరు. మీరు ఒంటరిగా పోటీ చేసినా, కలిసొచ్చినా కూడా మీరు గెల్చేది లేదు. ఇప్పుడే కాదు. ఏడాదిన్నర తర్వాత కూడా అదే పరిస్థితి.

అన్నీ బయటకు వస్తాయి:
    పవన్‌కళ్యాణ్, ఒక విషయం చెప్పండి. మీరు బీజేపీతో కలిసి ఉన్నారా? లేదా? చంద్రబాబుతో రెండు గంటలు ఏం మాట్లాడారంటే.. నా గురించి, మరో మంత్రి అమర్‌నాథ్‌ గురించి మాట్లాడుకున్నామని మినట్‌ టు మినట్‌ చెప్పాడు. కానీ నీవు లోపల ఏం మాట్లాడావన్నది త్వరలో బయటకు వస్తాయి. చంద్రబాబు లీక్‌ చేస్తాడు. అన్నీ తెలుస్తాయి. 
రాష్ట్రంలో ఒక దౌర్భాగ్యకరమైన రాజకీయ భాషను తీసుకొస్తున్నారు. అరేయ్, తురేయ్‌ అంటున్నావు.

ఇకనైనా పిచ్చి మాటలు వద్దు:
    పవన్‌ వెంట ఉన్న యువత గుర్తించాలి. ఆయన తన కోసం, తన పార్టీ కోసం కాకుండా చంద్రబాబు కోసం పని చేస్తున్నాడు. ఆయన దగ్గర ప్యాకేజీ తీసుకుంటున్నాడు. దానికి వ్యూహం అని పేరు పెడుతున్నాడు.
రేపు మీ ఇద్దరూ కలిసి పోటీ చేసినా, చంద్రబాబు మనుషులే నీ పార్టీలో చేరుతారు. వారికే టికెట్లు ఇస్తావు. జరగబోయేది ఇదే. ఎందుకంటే నీ దగ్గర పోటీ చేసే వారే లేరు. అందుకే ఇకనైనా పవన్‌ పిచ్చి మాటలు కట్టిపెట్టాలి. ప్రజలు ఎక్కడా నీకు మద్దతు ఇవ్వబోరు. ఇలాగే మాట్లాడితే నీ స్థాయి ఇంకా తగ్గిపోతుంది.

 మేము ధైర్యవంతులం.. మాది ప్రజాబలం:

    నేను, అమర్‌నాథ్, రోజా ఎక్కువగా మాట్లాడతాం కాబట్టి, టార్గెట్‌ చేస్తున్నారు. మాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎల్లో మీడియా కూడా మమ్మల్ని టార్గెట్‌ చేస్తోంది. వారి విమర్శలను మేము ఎంజాయ్‌ చేస్తున్నాం. ఎందుకంటే మాకు ప్రజా బలం ఉంది.
    అలాగే జగన్‌గారు ఏనాడూ ఓట్ల కోసం గ్యారెంటీ కోరలేదు. ఆయన తనకు తాను ధైర్యవంతుడు అని చెప్పుకోలేదు. ఎందుకంటే ఆయన ఏమిటన్నది చరిత్ర చూడండి. అలాగే మా చరిత్ర చూడండి. ధైర్యం మా సొత్తో కాదో చెబుతారు. మేము నిజమైన ధైర్యవంతులం. అందుకే మాకు మేము చెప్పుకోం.
    ధైర్యం అంటే జగన్‌గారిది. ఆనాడు సోనియాను ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారు. ప్రజల్లో నిల్చారు. నిజమైన ధైర్యవంతుడు ఏదైనా ప్రాక్టికల్‌గా చూపిస్తాడు. కానీ తనకు తాను ధైర్యవంతుడినని చెప్పుకోడు.
పవన్‌ ఒక పిరికివాడు. అందుకే తనకు తాను అలా చెప్పుకుంటున్నాడని మంత్రి శ్రీ అంబటి రాంబాబు గుర్తు చేశారు.

Back to Top