స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వైయస్‌ఆర్‌ సీపీ వ్యతిరేకం

పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకమని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా వైయస్‌ఆర్‌ సీపీ అనేక పోరాటాలు చేసిందని గుర్తుచేశారు. 64 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసిన ఘనుడు చందరబాబు అని మండిపడ్డారు. చంద్రబాబు తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వేలాదిమంది ఉద్యోగుల జీవితాలతో చంద్రబాబు ఆటలాడుకున్నాడని గుర్తుచేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగడానికి వీల్లేదనేది సీఎం వైయస్‌ జగన్‌ విధానమని స్పష్టం చేశారు. 
 

Back to Top