ఇంటింటి సర్వే త్వరితగతిన పూర్తిచేయాలి

డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని

కరోనా నియంత్రణపై వైయస్‌ఆర్‌ జిల్లా అధికారులతో సమీక్ష

వైయస్‌ఆర్‌ జిల్లా: ఇంటింటి సర్వేను త్వరితగతిన పూర్తిచేయాలని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. వైయస్‌ఆర్‌ జిల్లాలో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్షా సమావేశం నిర్వహించారు. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పటిష్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సోషల్‌ డిస్టెన్స్‌ ద్వారానే కరోనాను నియంత్రించవచ్చు అన్నారు. ఇంటింటి సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అదే విధంగా కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులను వెంటనే క్వారంటైన్‌ సెంటర్లకు పంపించి వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు. క్వారంటైన్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్వారంటైన్‌లో ఉన్నవారిని నిరంతరం పర్యవేక్షిస్తుండాలని ఆదేశించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top