కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలకు ప్రత్యేక బృందాలు

కోవిడ్‌ ప్రభావిత జిల్లాల అధికారులతో మంత్రి ఆళ్లనాని సమీక్ష

అమరావతి: కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా ప్రభావిత జిల్లాల అధికారులతో మంత్రి ఆళ్ల నాని సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా కేసులు పెరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆళ్లనాని అధికారులను ఆదేశించారు. కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కోవిడ్‌ ఆసుపత్రులు సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలకు సర్వే బృందాలను పంపాలని మంత్రి ఆదేశించారు. మూడు రాష్ట్రాలకు సమీపంలో ఉన్నందున చిత్తూరులో ఎక్కువ కేసులు ఉన్నాయని, తిరుపతి రుయా, స్విమ్స్‌లో కరోనా చికిత్స అందిస్తున్నామని మంత్రి చెప్పారు. చిత్తూరు, మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 180 బెడ్లు సిద్ధం చేయాలని ఆదేశించారు.
 

Back to Top