ఏలూరు ఫ‌లితాలు చంద్ర‌బాబుకు చెంప‌పెట్టు  

డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి  ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్(ఆళ్ళ నాని)  

 సీఎం వైయ‌స్ జగన్ ప్రజారంజక పరిపాలనను రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. 

 ఏలూరు కార్పొరేషన్ లో వైయస్ఆర్‌సీపీ ఘన విజయం.. వైయ‌స్‌ జగన్ పరిపాలనకు గీటురాయి 

 ఎన్ని కష్టాలు వచ్చినా, సమర్థవంతమైన నాయకత్వంతో ప్రజా సంక్షేమమే లక్ష్యం 

 చంద్రబాబు కుట్ర రాజకీయాలు మానుకోకపోతే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు రిపీట్  

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా: అసలు ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలే జరగకూడదని చంద్రబాబు పలువిధాలుగా కుట్రలు, కుయుక్తులు పన్నార‌ని, ఆయన కుట్రలకు ఈ ఘన విజయం చెంప పెట్టు అని డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి  ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్(ఆళ్ళ నాని)  పేర్కొన్నారు.  రెండేళ్ళుగా సీఎం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారు ప్రజా రంజకంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారనడానికి ఈ వరుస ఎన్నికల ఫలితాలే నిదర్శనమ‌న్నారు. ఏలూరు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీ ఘ‌న విజ‌యం సాధించిన సంద‌ర్భంగా ఆళ్ల నాని మీడియాతో మాట్లాడారు.

కొద్దిరోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారిని ఏ విధంగా ఆశీర్వదించారో చూశాం. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా అప్పుడే జరిగినా, చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలు, కుతంత్రాల వల్ల ఎన్నికల ఫలితాలు కాస్త ఆలస్యమయ్యాయి కానీ, ఫలితం మాత్రం ఏకపక్షమే. అది వైయస్ఆర్ కాంగ్రెస్ పక్షమే అన్నది మరోసారి రుజువైంది. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఏవిధంగా పట్టం కట్టారో,  అదే ఒరవడిలో ఏలూరు నగర ప్రజలంతా జగన్ మోహన్ రెడ్డిగారిని ఆశీర్వదించారన్నది ఏలూరు కార్పొరేషన్ ఫలితాలు చూస్తే ఆర్థమవుతుంది. మొత్తం 50 డివిజన్లలో 47 డివిజన్లలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు గెలిపించారు. జగన్ మోహన్ రెడ్డిగారి నాయకత్వాన్ని ఆశీర్వదించారు. 

 రెండేళ్ళుగా సీఎం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారు ప్రజా రంజకంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారనడానికి ఈ వరుస ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఒకవైపు కరోనా విలయతాండవం చేసినా,  రాష్ట్ర ఆదాయం కుంటు పడినా, పాదయాత్రలో ఇచ్చిన ఏ ఒక్క హామీని విస్మరించకుండా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని, ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చారు. అదీ జగన్ మోహన్ రెడ్డిగారికి ప్రజల పట్ల ఉన్న కమిట్ మెంటు. చంద్రబాబులా ఇచ్చినా వాగ్దానాలను ఎగ్గొట్టాలనో..  లేక వాటిని వాయిదా వేయాలనో ఏనాడూ జగన్ మోహన్ రెడ్డిగారు భావించలేదు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, కరోనా కష్టకాలంలో ప్రజలను ప్రభుత్వమే ఆదుకోవాలన్న చిత్తశుద్ధితో పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేశారు. 

సీఎం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారి సుపరిపాలనను రాష్ట్ర ప్రజలంతా ఆశీర్వదిస్తున్నారు. ఒకవైపు నవరత్నాల్లాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే.. మరోవైపు నాడు-నేడు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, విద్య, వైద్య, ఆరోగ్య రంగాలను వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి, వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి, పక్కా ఇళ్ళ నిర్మాణం చేస్తున్నారు. 

 ఎన్ని ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, సమర్థవంతమైన నాయకత్వంతో, ప్రణాళికాబద్ధంగా, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, ధ్యేయంగా పనిచేస్తున్నందుకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారికి రాష్ట్ర ప్రజలంతా ప్రతి ఎన్నికల్లోనూ మద్దతు పలుకుతున్నారు. 

 ఏలూరు నగరానికి సంబంధించిన ఫలితాలను ఆపటానికి చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా, ప్రజా తీర్పును ఎంతోకాలం ఆపలేరన్నది నిరూపితమైనది. జగన్ గారి పట్ల ఉన్న ప్రేమాభిమానాలు ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబంబించాయి. 

 కరోనా వేళ చంద్రబాబు ఏ విధంగా శవ రాజకీయాలు చేశారో చూశాం. ఇటువంటి కుట్ర పూరిత రాజకీయాలు, కుతంత్రాలు ఆపకపోతే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు పునరావృత్తం అవుతాయి. టీడీపీ భూస్థాపితం అవుతుంది. 

వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారు అమలు చేస్తున్న సంక్షేమం- అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడితే.. చంద్రబాబుకు మళ్ళీ మళ్ళీ ఇవే ఎదురు దెబ్బలు తగులుతాయని చెబుతున్నాం. ఏలూరు కార్పొరేషన్ లో ఘన విజయాన్ని ఇచ్చి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ గెలుపును ప్రజలు కానుకగా ఇచ్చారు. 

 ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారికి ఏలూరు నగర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎన్నో ఏళ్ళుగా పరిష్కారం కాని ఏలూరు నగరం నుంచి వెళుతున్న తమ్మిలేరు ముంపు సమస్య పరిష్కారానికి జగన్ మోహన్ రెడ్డిగారు పరిష్కారం చూపించారు. తమ్మిలేరు ముంపు పరిష్కారానికిగాను, గోడ నిర్మాణానికి రూ. 80 కోట్ల నిధులు జగన్ గారు మంజూరు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయనడానికి ఏలూరు నగరాభివృద్ధే తార్కాణం అని చెప్పవచ్చు. ఏలూరు నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి అందిస్తున్న సహకారానికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

 రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలన్నా, ఏ చింతా లేకుండా పేదవాడు గుండె మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోవాలన్నా అది జగన్ మోహన్ రెడ్డిగారి పరిపాలన వల్లే సాధ్యం అవుతుందని ప్రజలను సంపూర్ణంగా నమ్ముతున్నారు. 

 ఈ సమావేశంలో పాల్గొన్న ఏలూరు ఎంపీ  కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి మంచి ముఖ్యమంత్రి వచ్చారు. మనసున్న నాయకుడుగా ప్రజలకు సేవలందిస్తున్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం మాకు గర్వంగా, గౌరవంగా ఉంది అని అన్నారు.
 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top