చంద్రబాబు మోసగాళ్లకు మోసగాడు

 అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కామ్‌పై చర్చలో మంత్రి ఆదిమూలపు సురేష్‌

అమరావతి: చంద్రబాబు మోసగాళ్లకు మోసగాడ‌ని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు స్కామ్‌పై  అసెంబ్లీలో జ‌రిగిన చ‌ర్చ‌లో మంత్రి మాట్లాడారు. అవినీతి అనే చాలా చిన్న పదం. అమరావతి గ్రాఫిక్స్‌తో గారడి చేసిన వ్యక్తి చంద్రబాబు. అమరావతి భూములను నొక్కేసిన టక్కరి దొంగ చంద్రబాబు అని మంత్రి విమ‌ర్శించారు. ఐఆర్‌ఆర్‌ మలుపులు తిరిగి కొంతమంది భూముల్లోకి వెళ్లింద‌ని పేర్కొన్నారు. ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ అలైన్‌మెంట్‌ను ఇష్టం వచ్చినట్లు మార్చుకున్నార‌ని చెప్పారు. ఈ స్కామ్‌కు డైరెక్షన్‌ చంద్రబాబు.. పర్యవేక్షణ లోకేష్ అని అభివ‌ర్ణించారు. అమరావతి అనేది అంతర్జాతీయ స్కాం. ఐఆర్‌ఆర్‌ అక్రమాలన్నింటికీ స్పష్టమైన ఆధారాలున్నాయని మంత్రి స్ప‌ష్టం చేశారు.

Back to Top