ఏలూరు: దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన చింతమనేని ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. దెందులూరు నియోజకవర్గంలో జరిగిన ఓ పబ్లిక్ మీటింగ్‌లో దళితులను ఉద్దేశించి చింతమనేని అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీన్ని వైయస్‌ఆర్ సీపీ తీవ్రంగా ఖండించింది. గతంలో చంద్రబాబు దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని కించపరిచేలా మాట్లాడారు. చంద్రబాబు దారిలో తెలుగుదేశం పార్టీ నేతలు వర్ల రామయ్య, ఆదినారాయణరెడ్డి, తాజాగా చింతమనేని ప్రభాకర్ దళితులను అడుగడుగునా అవమానపరుస్తూ వస్తున్నారు.