అమరావతి: వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు.వైయస్‌ఆర్‌సీపీ నేతలు జెండా ఎగరవేసి దివంగత నేత వైయస్‌ఆర్ విగ్రహానికి నివాళర్పించారు.ఈ కార్యక్రమంలో మల్లాది విష్ణు, గౌతంరెడ్డి,వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు పాలనలో కార్మిక వ్యతిరేక విధానాలు:గౌతంరెడ్డి చంద్రబాబు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభించారని వైయస్‌ఆర్‌సీపీ నేత గౌతంరెడ్డి ఆరోపించారు.కార్మిక వ్యవస్థ బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్మిక వర్గ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకున్నారు: వెల్లంపల్లి శ్రీనివాస్ చంద్రబాబు ఎప్పడూ కార్మికులకు,కర్షకులకు న్యాయం చేయలేదని వైయస్‌ఆర్‌సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు పరిపాలనను వ్యతిరేకిస్తున్నారన్నారు.రాష్ట్ర విభజన సమయంలో ఒక అనుభవం గల వ్యక్తిగా చంద్రబాబుకు అవకాశం ఇస్తే ఈ ఐదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు.ఏవర్గానికి న్యాయం చేయకుండా చంద్రబాబు కాలయాపన చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ పాలనలో కార్మికుల నిరాదరణ ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వం పాలనలో కార్మికులు నిరాదరణకు గురి అయ్యారని వైయస్‌ఆర్‌సీపీ నేత మల్లాది విష్ణు అన్నారు.కార్మికుల జీవన స్థితి గతులు మెరుగుపర్చడానికి, వారి జీవితాలకు భరోసా కల్పించడానికి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ఈ సందర్భంగా తెలిపారు.అన్నివర్గాలకు చేయూతనిచ్చేవిధంగా పాలన సాగిస్తారని తెలిపారు.