సోషల్ మీడియాపై దాడులు.. ప్రజాస్వామ్యానికి విఘాతం

వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్‌

తూర్పుగోదావరి:  సోషల్ మీడియాపై దాడులు చేయటం.. ప్రజాస్వామ్యానికి విఘాతమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతంపేట మూలగొయ్యి గ్రామనికి చెందిన యువకుడుపై దాడి జరిగిందని ఆయ‌న తెలిపారు. దాడికి సంబంధించిన ప్రత్యక్ష వీడియోలు కూడా ఉన్నా.. పోలీసుల వద్ద నుంచి ఎటువంటి స్పందన లేదని మండిపడ్డారు. సోమవారం మార్గాని భరత్‌  మీడియాతో మాట్లాడారు.

 మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ పాలనలో ఉన్నట్టుంది. కచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతాం. ప్రజల గళాన్ని వినిపిస్తాం. మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ అనుసరిస్తున్నారు. సోషల్ మీడియాపై దాడులు చేయటం.. ప్రజాస్వామ్యానికి విఘాతం. సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టులు చేసి.. ఏ కోర్టులో హాజరు పరుస్తున్నారో కూడా తెలియటం లేద‌న్నారు. ఇంటూరి ర‌వికిర‌ణ్‌ను రోజుకో పోలీస్ స్టేష‌న్ తీసుకెళ్లి వేధిస్తున్నార‌ని, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు పోలీసులు స‌రైన స‌మాచారం ఇవ్వ‌కుండా ఇబ్బంది పెడుతున్నార‌ని పేర్కొన్నారు. 

Back to Top