ప‌లువురు టీడీపీ కీల‌క నేత‌లు వైయస్ఆర్‌సీపీలో చేరిక‌

కృష్ణా జిల్లా:  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో ప‌లువురు కీల‌క నేత‌లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేసరిపల్లి నైట్‌ స్టే పాయింట్‌ వద్ద ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమక్షంలో పెనమలూరు నియోజకవర్గం తెలుగుదేశం, బీసీవై పార్టీలతో పాటు ప్రజాసంఘాల నుంచి  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేతలు.

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ టిక్కెట్‌ యాస్పిరెంట్‌ చలసాని స్మిత(చలసాని పండు కుమార్తె), దేవినేని గౌతమ్‌ దంపతులు.

పెనుమలూరు నియోజకవర్గం బీసీవై పార్టీ నుంచి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కె ఉమావల్లియాదవ్‌.

పెనమలూరు నియోజకవర్గం నుంచి  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాదిగ హక్కుల కమిటీ పౌండర్‌ గురివిందపల్లి చిట్టిబాబు మాదిగ  కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జోగి రమేష్‌

కేసరిపల్లి నైట్‌ స్టే పాయింట్‌ వద్ద నందిగామ నియోజకవర్గం తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీ నుంచి ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమక్షంలో  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేతలు.

నందిగామ మార్కెటింగ్‌ కమిటీ మాజీ చైర్మన్, 3 దశాబ్దాలుగా టీడీపీ కీలకనేత చిరుమామిళ్ల శ్రీనివాసరావు(అలియాస్‌ బుజ్జి), నందిగామ పట్టణ మాజీ అధ్యక్షుడు, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ వడ్డెలి శ్రీనివాసరావు,  నందిగామ మున్సిపల్‌ టీడీపీ కీలక నేత వై రామారావు, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గోడపాటి బాబూరావు, టీడీపీ ఎన్టీఆర్‌ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు షేక్‌ కరీముల్లా, టీడీపీ సీనియర్‌ నేత డాక్టర్‌ షేక్‌ హసీనా, టీడీపీ సీనియర్‌ నేత కొమ్ము విజయరాజులు.
 
కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని, నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌.

Back to Top