అసెంబ్లీలో ప‌లు కీలక బిల్లులకు ఆమోదం 

అసెంబ్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఆయా శాఖలకు చెందిన మంత్రులు ప్రవేశపెట్టిన బిల్లులకు శాసనసభ ఆమోదముద్ర వేసింది. ఏపీపీఎస్సీ చట్ట సవరణకు బిల్లు ఏపీ జీఎస్టీ సవరణ, ఏపీఎస్‌ ఆర్టీసీ బిల్లులకు ఆమోదం తెలిపింది. ఏపీ మోటార్‌ వెహికిల్‌ ట్యాక్స్‌ సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదముద్ర వేసింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌ అసైన్డ్‌ భూముల చట్టం సవరణ బిల్లుకు, ఏపీ భూదాన్, గ్రామ దాన్‌ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. అంతేకాకుండా చారిటబుల్, హిందూ రిలీజియన్‌ ఇనిస్టిట్యూట్, దేవాదాయ చట్ట సవరణ బిల్లుకు, ఏపీ ప్రైవేట్‌ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది.

Back to Top