సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బీసీ బాంధ‌వుడు

విజ‌య‌వాడ‌:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బీసీ బాంధ‌వుడ‌ని మంత్రి వ విడ‌ద‌ల ర‌జ‌ని అన్నారు. చంద్ర‌బాబు బీసీల ప‌ట్ల రాబంధు అని మండిప‌డ్డారు. విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన జ‌య‌హో బీసీ మ‌హాస‌భ‌లో మంత్రి మాట్లాడారు. ఐదేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌లో బీసీల‌కు వెన్నుపోటు పొడిచార‌ని మంత్రి మండిప‌డ్డారు. బీసీల‌కు రాజకీయ గౌరవం ఇచ్చింది సీఎం వైయ‌స్ జగన్‌ అని మంత్రి విడదల రజని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారని అన్నారు. ఈ మూడున్నరేళ్లలోనే బీసీల్లో ఎంతో పేరు సంపాదించిన సీఎం వైయ‌స్‌ జగన్‌ను చూసి టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ  జయహో బీసీ సభ అనగానే టీడీపీలో వణుకు మొదలైంద‌న్నారు. బీసీలే టీడీపీకి సమాధి కడతారు. బీసీలకు ఏం చేశామో.. ధైర్యంగా మేం చెప్పుకోగలం. చంద్రబాబుకు ఆ ధైర్యం ఉందా? బీసీలకు బాబు వెన్నుపోటు పొడిచారు. బీసీల గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు.  బీసీలను చంద్రబాబు ఓటింగ్‌ యంత్రాలుగానే చూశారు. ఒక్క బీసీకి కూడా రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వలేదు. సీఎం  వైయ‌స్ జగన్‌ ఏకంగా నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించారు. బీసీల గుండెల్లో వైయ‌స్‌ జగన్‌ ఉన్నారు. బాబు పునాదులు కదులుతున్నాయి. ఇదేం ఖర్మరా బాబూ అంటూ ప్రజలు విసుక్కుంటున్నారని మంత్రి విడ‌ద‌ల ర‌జ‌ని తెలిపారు.

Back to Top