టీడీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు

 ఎమ్మెల్యే మల్లాది విష్ణు 
 

విజయవాడ: టీడీపీ హయాంలో విజయవాడ అభివృద్ధికి  ఒక్క రూపాయి ఇవ్వలేదని  ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. సీఎం వైయస్‌ జగన్‌ ఏడు నెలల పాలనలో నగరంలోని ప్రతి నియోజకవర్గనికి వంద కోట్లు కేటాయించారని విష్ణు గుర్తు చేశారు.  వంద కోట్లతో విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో  20 డివిజన్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిధులు మంజూరు చేశారని  అన్నారు. బుధవారం సెంట్రల్‌ నియోజకవర్గంలోని 19, 21, 45  డివిజన్లలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే కైలే అనిల్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 1,  5 , 44, 45 డివిజన్లలోని ప్రజలకు అందుబాటులో ఉండేలా 35 లక్షలతో  కర్మల షెడ్లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. గత ప్రజల సమస్యల పరిష్కారానికి సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రతి డివిజన్ ఒక యూనిట్‌గా తీసుకుని సమస్యలు పరిష్కరింస్తామని మల్లాది విష్ణు పేర్కొన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top