ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేటుకు దీటుగా తీర్చిదిద్దుతాం

రాష్ట్ర విద్య, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్లా విజయ ప్రసాద్
 

 
 అమరావతి: ఆంధ్రప్రదేశ్‌  రాష్ట్ర విద్య, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా మల్లా విజయ ప్రసాద్ బుధవారం బాధ్యతల స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడూతూ..ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకి అనుగుణంగా పనిచేస్తాను అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతాం ఆయన తెలిపారు.

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మౌళిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా తోడ్పడతాను విజయ ప్రసాద్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు తో పాఠశాలలని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. బాలికల పాఠశాలలో మరుగుదొడ్లు మంచినీరు వంటి సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.

తనపై ఎంతో నమ్మకంతో  సీఎం వైయ‌స్‌ జగన్‌ అప్పగించిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని విజయ ప్రసాద్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్ నాగరాజు , జనరల్ మేనేజర్ మల్లికార్జున రావు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు గోపీచంద్, కరుణాకర్,ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ రామారావు, స్టేట్ జాయింట్ సెక్రెటరీ సతీష్ తదితరులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top