తెలుగు దేశం పార్టీకే భవిష్యత్తు లేదు

 మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి  

వైయ‌స్ఆర్ జిల్లా:  రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీకి భ‌విష్య‌త్ లేద‌ని మైదుకూరు నియోజకవర్గ శాస‌న స‌భ స‌భ్యులు శెట్టిపల్లె ర‌ఘురామిరెడ్డి అన్నారు. దువ్వూరు మండలం పెద్ద జొన్నవరం గ్రామంలో నిర్మించిన నూతన సచివాలయ భవనాన్ని  మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ప్రారంభించారు. 2024 ఎన్నికల తర్వాత టిడిపి పార్టీకి భవిష్యత్తు లేదని అలాంటి టిడిపి వారు 'భవిష్యత్తు గ్యారెంటీ' అని చెబుతూ ప్రజలను మోసం చేయాలని  చూస్తుంటే  హాస్యాస్పదం ఉందన్నారు. సచివాలయం, వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన సీఎం వైయ‌స్‌ జగన్ తీసుకువచ్చారని, సీఎం వైయ‌స్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ  నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు శెట్టిపల్లె నాగిరెడ్డి, పార్టీ నాయ‌కులు, ప్ర‌జా ప్ర‌తినిధులు పాల్గొన్నారు.
.

Back to Top