శ్రీ‌కాకుళంలో విస్తృతంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ 

మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాదరావు నేతృత్వంలో ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులను పలకరిస్తున్న పార్టీ శ్రేణులు, గృహ సార‌ధులు

శ్రీ‌కాకుళం: మా నమ్మకం నువ్వే జగన్‌ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రూపొందించిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం శ్రీ‌కాకుళం నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా కొన‌సాగుతోంది. మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఆదేశాల మేర‌కు వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు ప్రతి ఇంటికి వెళ్లి వారితో 15 నిమిషాలకు పైగా మాట్లాడి గత టీడీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన వైనాన్ని వివరిస్తున్నారు. అదే క్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న పరిస్థితిని వివరించి చెబుతున్నారు. అడుగడుగునా జ‌న‌న‌న్న సైన్యానికి ఆత్మీయ పలకరింపులు.. ప్రభుత్వ పథకాలను వివరిస్తుంటే ఎదురొస్తున్న ప్రజా మనన్నల‌తో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కదంతొక్కుతున్నారు.  నువ్వే మా నమ్మకం .. మా భవిష్యత్‌ నువ్వే జగన్‌ అంటూ ప్రజానీకం నినదిస్తున్నారు.  ఈ సందర్బంగా ఇంటింటికి వెళ్లి వైయ‌స్ఆర్‌ సీపీ, టీడీపీ ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తున్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top