విజయవాడ: తెలుగు దేశం పార్టీ నుంచి ఆ పార్టీ కార్యకర్తలే చంద్రబాబును తరిమివేయాలని వైయస్ఆర్‌సీపీ వైయస్ఆర్‌సీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతి పిలుపునిచ్చారు. రెండు ఎకరాలున్న చంద్రబాబు రూ. 6 లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు? అని ఆమె ప్రశ్నించారు. విజయవాడలో శుక్రవారం లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయటం మనం చూశామని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా స్థాపించిన టీడీపీని ఆ పార్టీకే తాకట్టుపెట్టాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఎందుకు ఓట్లు వేయాలి? అని లక్ష్మీ పార్వతి నిలదీశారు. అధికారం కోసం ఎవరి కుటుంబంలోనైనా చిచ్చుపెట్టే వ్యక్తి చంద్రబాబు అని ఆమె ధ్వజమెత్తారు. చంద్రబాబుది నీచమైన వ్యక్తిత్వమని ధ్వజమెత్తారు. చంద్రబాబు వలన రాష్ట్ర ప్రజలకు ఏ ప్రయోజనమైనా చేకూరిందా?. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఇప్పుడు ఎలా ఉంది?. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆనాడు ఎన్టీఆర్ టీడీపీని పెట్టారు. చంద్రబాబు దుర్మార్గాలను టీడీపీ కార్యకర్తలు గ్రహంచాలి. చంద్రబాబు లాంటి వ్యక్తి ఏ కుటుంబంలోనూ ఉండకూడదని ఎన్టీఆర్ అన్నారు. టీడీపీలో నుండి కార్యకర్తలే చంద్రబాబును తరిమేయాలి. ఎల్లోమీడియాని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కోర్టుల్లోని కేసులను కూడా చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయటంలో చంద్రబాబు దిట్ట. అలాంటి వ్యక్తి వలన ప్రజలకు ఉపయోగం లేదు. బీజేపీ అధికారంలోకి వస్తుందని మోదీ పార్లమెంటులో చెప్పగానే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. గంటసేపు ఢిల్లీలో చంద్రబాబు కనపడలేదు, వెంటనే ఒక ఫేక్ సర్వే బయటకు వచ్చింది. అలాంటి వ్యవహారాలు చేయటంలో చంద్రబాబు దిట్ట. ఎన్నికలు వస్తుండటంతో రకరకాల వేషాలతో వస్తున్నారు. వారందరికీ నాయకుడే చంద్రబాబే. ఎన్టీఆర్‌కీ, పిల్లలకీ మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. ఇప్పుడు వైయస్ జగన్ కుటుంబంలో చంద్రబాబు చిచ్చు పెట్టాడు. పేదల అభివృద్ధి కోసం వైయస్ జగన్ ఎంత చేస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. చంద్రబాబు ఏనాడైనా పేదలను పట్టించుకున్నారా?. విద్య, వైద్యరంగంలో ఎన్ని మార్పులు వచ్చాయో చూశాం. వైయస్ జగన్ లాంటి వ్యక్తిని మళ్ళీ సీఎం చేసుకోవాలి. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుని అమిత్ షాతో కలవలేదు. కలిస్తే ఆ ఫోటో చూపించాలి. చంద్రబాబు అందరికీ ఒంగిఒంగి నమస్కారాలు పెడుతున్నారు. చంద్రబాబుకు గెలుపు మీద ఆశలు లేవు. అందుకే అడిగినన్నిసీట్లనూ బీజేపీకి ఇచ్చేందుకు సిద్దపడ్డారు. కేసుల నుంచి తప్పించుకోవటానికి చంద్రబాబు బీజేపీతో కలవబోతున్నారు. టీడీపీకి ఈ ఎన్నికలతో ఎండ్ కార్డు పడుతుంది. షర్మిళ దారి తప్పిన బాణం. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు చదవటమే షర్మిళ పని. చంద్రబాబు, జనసేన మధ్య ఇప్పటికీ సయోధ్య లేదు అని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు.