దరిద్రానికి డెఫినిషన్‌ చంద్రబాబు

మాజీ మంత్రి కన్నబాబు

చంద్రబాబు ఎక్కడ పాదం మోపితే అక్కడ కరువు, కష్టాలే! 

వైయ‌స్ జగన్ అధికారం చేపట్టాక సమృద్ధిగా వానలు 

కుప్పంలో గెలవలేని పరిస్థితి చంద్రబాబుది

 అన్న ఎవరో.. దున్న ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలుసు

కృష్ణా:  చంద్రబాబు ఎక్కడ పాదం మోపితే అక్కడ కరువు, కష్టాలే అని.. దరిద్రానికి డెఫినిషన్‌ చంద్రబాబు అని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు విమ‌ర్శించారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబే అని మండిప‌డ్డారు. చంద్రబాబు, లోకేష్‌లు ప్రవాసాంధ్రులని ఎద్దేవా చేశారు. నారా లోకేష్‌ చేపట్టిన పాదయాత్రకు ప్రజాస్పందన కరువైందని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తేల్చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక అజెండా లేకుండా లోకేష్‌ పాదయాత్ర కొనసాగుతోందన్నారు. చంద్రబాబు తాను లేస్తే మనిషిని కాదంటాడు.. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అంటాడు.  
మాజీ సర్పంచ్ చేత క్లాస్‌ పీకించుకున్నాడు. ఇంత కంటే దరిద్రం ఉంటుందా బాబూ... చంద్రబాబు అంటే దరిద్రమని ప్రజలే చెబుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటే వానలు పడవు. వైయ‌స్ జగన్ అధికారం చేపట్టాక సమృద్ధిగా వానలు కురుస్తున్నాయ‌ని,  ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా ఉన్నాయ‌ని చెప్పారు.  

బాబే అసలు దరిద్రం:
    రాష్ట్రానికి బాబే దరిద్రం.. దాన్ని వదిలిస్తున్నది జగన్‌ గారు..
 రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఎవరని ప్రశ్నించుకుంటే చంద్రబాబే అన్న సమాధానం వస్తుంది.
    ఇక అసలు దరిద్రం అంటే ఏంటి? ప్రజాదరణ లేకపోవడాన్ని దరిద్రం అంటాం. 2014–19 మధ్య కాలంలో చంద్రబాబు పరిపాలన అంతా అరిష్టాల మయం. కరవు రాజ్యమేలింది. వానలు లేవు. పంటలు లేవు. ప్రాజెక్టులు నిండింది లేదు. గోదావరి నీటిని కృష్ణకు మళ్లించాల్సిన పరిస్థితి. బాబు పాలనలో కరవు కాటకాలు వచ్చాయంటే దరిద్రం కాక మరేమిటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ బాబు హయాంలో కరవు కాటకాలే. 

జగన్‌గారి పాలన సస్యశ్యామలం:
    జగన్‌గారి పాలనలో రాష్ట్రమంతా సస్యశ్యామలమే. వర్షాలు సకాలంలో కురిశాయి. పంటలు పుష్కలంగా పండాయి. కరవు మండలాలే లేవు. దీన్ని బట్టి తెలియడం లేదా? ఎవరి పాలన దరిద్రమో?. ఎవరి పాలన అదృష్టమో?. జగన్‌గారు జనానికి అదృష్టం. టీడీపీ జనానికి పట్టిన దరిద్రం. కుప్పంలో పది ఎంపీటీసీ సభ్యులనూ గెల్చుకోలేని బాబుది అదృష్టమని ఎవరంటారు? 
    బాబును రాష్ట్రంలోనే ఇల్లు కట్టుకుని ఉండాలని స్వయంగా టీడీపీ కార్యకర్తే హితవు చెప్పాడంటే..బాబును ప్రవాసాంధ్రుడిగానే అతను పరిగణిస్తున్నట్లే కదా? సాధారణ కార్యకర్తే ఇలా ఛీకొట్టాడంటే ఇంతకన్నా బాబుకు ఏ అవమానం కావాలి?.

బాబు బతుకంతా వంచనే:
    పేద మహిళలకు డ్వాక్రా రుణమాఫీ పేరిట చేసిన వంచనను జనం మరిచిపోయారని బాబు అనుకుంటున్నాడు. హామీలను అమలు చేయాల్సి వస్తుందని టీడీపీ మేనిఫెస్టోనే వెబ్‌సైట్‌ నుంచి తొలగించేసిన వంచకుడు.  అతని బతుకంతా వంచనే. ఇలాంటి వాడు జగన్‌ గారిపై విమర్శలు చేస్తాడు. జనానికి మతిమరుపని బాబు భ్రమ పడుతుంటాడు. అన్నీ జనం గుర్తుంచుకునే 2019లో సరైన దెబ్బకొట్టారు. ఇదే 2024లోనూ పునరావృతం అవుతుందని తేటతెల్లమవడంతో చంద్రబాబు గంగ వెర్రులెత్తిపోయి జగన్‌గారిపై దిక్కుమాలిన విమర్శలు చేస్తున్నాడు. 

పిచ్చి మాటలు. పిచ్చి చేష్టలు:
    తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేశ్‌లు పిచ్చిపట్టిన వారిలా కలయదిరుగుతూ పిచ్చిమాటలు, పిచ్చిచేష్టలు చేస్తున్నారు. వీరి విన్యాసాలను చూసి టీడీపీ కార్యకర్తలే పగలబడి నవ్వుకుంటున్నారు. తండ్రీ కొడుకులిద్దరికీ మాట్లాడడం రాదు. జనం చూస్తే వీరిని చూస్తే దూరంగా పారిపోతున్నారు. దాంతో తట్టుకోలేకపోతున్న బాబు, లోకేశ్‌ నిరాశా నిçస్పృహలకు లోనై జగన్‌ గారిని అడ్డదిడ్డంగా విమర్శిస్తున్నారు. 
    చూసే జనానికి తండ్రీకొడుకుల చేతకానితనం అర్థమైపోయింది. 
 అందుకే పట్టుమని పది మంది కూడా వీరి సభలకు రావడం లేదు. ఏ తండ్రయినా కొడుకు సమర్థుడు కావాలనుకుంటాడు. అదేం చిత్రమో కాని లోకేశ్‌ అసమర్థతను, వెర్రివెంగళాయత్వాన్ని చూసి బాబు సహజంగానే కుమిలిపోయి, ఆ నిరాశను కొడుకుపై చూపించలేక జగన్‌గారిపై విమర్శలు
చేస్తున్నాడు. 

ఎజెండా లేని యాత్రలు:
    వారివి యాత్రలు కాదు. శాపనార్థాల యాత్రలు. దానికి అజెండా అంటూ ఏమీ లేదు. మా పాలనలో ఇదిగో మేం సాధించిన ప్రగతి...అని చెప్పే దమ్మూ ధైర్యమూ లేవు. ఏదైనా సాధిస్తే చెప్పడానికి ఉంటుంది. తమ పద్నాలుగేళ్ల పాలన అంతా అవినీతి మయం చేసిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లోనూ గెలవలేమని నిర్ధారణకు వచ్చేసి, నిస్సహాయంగా, నిరాశలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌పై పనికిమాలిన విమర్శలు చేస్తున్నాడు. 

భాష రాని సంస్కారహీనుడు:
    చంద్రబాబు తనయుడు లోకేశ్‌ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఇతనికి పప్పు అనే బ్రాండ్‌నేమ్‌ ఉండనే ఉంది. దాన్నుంచి బయట పడేయడానికి ఎవరో నాలుగు ముక్కలు నేర్పారు. అదీ బూతు భాష. ఆ బూతుల భాష లోకేశ్‌ ఎంత దిగజారుడు మనిషో చెబుతోంది. చాలా నీచమైన భాషతో జగన్‌గారిపై విమర్శలు చేస్తున్నాడు. లోకేశ్‌ ఎక్కడా గెలవలేకపోతే దొడ్డిదారిన ఎమ్మెల్సీ, మంత్రి పదవులను బాబు కట్టబెట్టాడు. ఇలాంటి అసమర్థుడు, చేతకాని దద్దమ్మ.. పరిపాలనలో  ఆకాశమంత ఎత్తులో  నిలిచి, అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా 151 స్థానాల్లో విజయభేరి మోగించిన జగన్‌ గారిని విమర్శిస్తున్నాడు. 
    బజారు స్థాయిలో బరి తెగించి లోకేశ్‌ మాట్లాడుతున్నాడు. కామధేనువును వదిలి దున్నను తెచ్చుకున్నారని ఈ పశువు విమర్శలు చేస్తున్నాడు. దున్నలు, ఆంబోతులు, పశు ప్రవృత్తి కలిగిన నేతలున్న పార్టీ టీడీపీ. నాలుగు తిట్లు తిట్టి మాతో పది తిట్లు తిట్టించుకుంటారు. బాబు, లోకేశ్‌లు చేతులు ఊపే హావభావాలే నీచాతినీచంగా ఉన్నాయని జనమే తిడుతున్నారు. టీడీపీకి ఇంతకన్నా సిగ్గుచేటు ఏముంటుంది? ఇలాంటి నీచమైన హావభావాలతో జనానికి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారో బాబు, లోకేశ్‌లు చెప్పాలి.

అయ్యన్నవి ఒళ్లు బలిసిన మాటలు:
    తాజాగా అయ్యన్నపాత్రుడు ఈ తండ్రీ కొడుకులకు తోడయ్యాడు. అతను స్పృహ ఉండి మాట్లాడుతున్నాడో, లేక గంజాయి పీల్చిన మత్తులో మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. లేదా ఒళ్లు బలిసిన మాటలైనా అయి ఉండాలి. ఇతను ఆడవారిని రాజకీయాల్లోకి లాగుతాడు. భారతిగారి గురించి ప్రస్తావిస్తాడు. అలా ఆమెను అంటే బాబు భార్య గురించి వైఎస్సార్‌సీపీ రెచ్చిపోయి ప్రతిస్పందిస్తుందన్న ఆలోచన అనుకుంటా.  విశాఖపట్నంలో పిచ్చి ఆస్పత్రి ఉంది కనుక రాజధానిని అక్కడికి మారుస్తున్నారని ఈ మెంటల్‌ అయ్యన్న మాట్లాడుతున్నాడు. ఇలాంటి ప్రేలాపనలకు ముందు  అయ్యన్నను, చంద్రబాబును, లోకేశ్‌ను, టీడీపీ నేతలను మెంటల్‌ ఆస్పత్రిలో చేర్చాలి.

మేం సమాధానం చెబితే..:
    వయసు పెరిగే కొద్దీ మనిషిలో మానసిక పరిపక్వత రావాలి. బుద్ధి వికసించాలి. అదేం చిత్రమో కాని టీడీపీ నేతలంతా నానాటికీ దిగజారి పోయి బజారు భాష మాట్లాడుతున్నారు. ఇలాగే  మీ భాషలోనే వైఎస్సార్‌సీపీ నేతలు మీకు సమాధానం చెప్పాల్సి వస్తే మీరు తట్టుకోలేరని బాబు, లోకేశ్, అయ్యన్నపాత్రుడి బృందాన్ని హెచ్చరిస్తున్నాం. 
    కొడాలి నాని వంటి వారు కొద్దిగా ఘాటుగా మాట్లాడితేనే బూతులు మాట్లాడుతున్నారని తెగ బాధపడిపోయే ఎల్లో మీడియా మరి బాబు, లోకేశ్, అయ్యన్న, అచ్చెన్నల ప్రసంగాలకు ఏం సమాధానం చెబుతుంది?
అందుకే మేం సమాధానం చెబితే తట్టుకోలేరు.

లోకేశ్‌ మాట వింతల్లో ఒక వింత:
    రాయలసీమలోనే పుట్టారా? అంటూ గౌరవ సీఎంగారిని నిందిస్తాడు లోకేశ్‌. మరి ఇదే లోకేశ్‌కు తిరిగి మా వాళ్లు సమాధానం చెబితే తట్టుకోలేడు. జగన్‌గారు టెన్త్‌ ఫెయిలయ్యారని, అందుకే పెళ్లి కానుకకు టñన్త్‌ పాసవ్వాలని నిబంధన పెట్టారని బాబు విమర్శిస్తాడు. అసెంబ్లీలో జగన్‌గారు తన విద్యార్హతల గురించి స్పష్టంగా చెప్పారు. ఆయన విద్యార్హతలతో చదువురాని దద్దమ్మ లోకేశ్‌కు పోలికా? లోకేశ్‌తో టెన్త్‌  పరీక్ష రాయించండి చూద్దాం. పాసవుతాడో, ఫెయిలవుతాడో తేలిపోతుంది. 
    తన కొడుకుతో ఆంధ్రప్రదేశ్‌ అని రాయించడం చేతకాని దద్దమ్మ లోకేశ్‌ చదువు సంధ్యలను మరిచిపోయి జగన్‌ గారి చదువు గురించి బాబు  మాట్లాడడం వింతల్లోకెల్లా వింత. 

జగన్‌గారు చేసేదే చెబుతారు:
    జగన్‌గారి నటనకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వాలని చంద్రబాబు అనే మహానటుడు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తాడు. నన్ను మించిన మహానటుడని సాక్షాత్తూ ఎన్టీఆర్‌ గారే బాబుకు సర్టిఫికెట్‌ ఇచ్చారు. బాబు నటన, వంచనా చాతుర్యాన్ని ఎన్టీఆరే బట్టబయలు చేశారు. సర్టిఫైడ్‌ సైకోలని ఎవరినైనా పిలవాలంటే అది చంద్రబాబు, లోకేశ్‌లనే పిలవాలి. జగన్‌ గారు చేసేదే చెబుతారు. చెప్పేదే చేస్తారు తన వల్ల కానిది చేయలేనని స్పష్టంగా చెబుతారు. అంతేకానీ చంద్రబాబులా జనాన్ని మాయ చేయరు. 

సచివాలయ భవనాల పేరిట కోట్లు స్వాహా:
    నీ పాలనలో ఏం సాధించావని బాబును అడిగితే అమరావతిని రాజధానిని చేశానంటాడు. ఆ రాజధాని పేరిట సేకరించిన భూముల్లో గేదెలు తిరుగుతుంటాయి. సచివాలయ తాత్కాలిక భవనాలు చూస్తే కోట్లకు కోట్లు మింగేసి నాసిరకంగా కట్టించాడు.. గదుల్లోకి నీళ్లు వస్తాయి. పొరుగునే ఉన్న తెలంగాణలో సచివాలయ భవనాలను ఇంతకన్నా తక్కువ వ్యయంతో శాశ్వత భవనాలను అద్భుతంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కట్టిస్తున్నారు. ఆనాడు మీరు గ్రాఫిక్స్‌లో చూపిన అమరావతి ఏది? జనాన్ని మాయలో పడేసి, ప్రజాధనాన్ని దోచుకున్నారు. 

భ్రమల్లో యనమల:
    వీరికి తోడు యనమల రామకృష్ణుడు అనే మేధావి ఒకరున్నారు. ఆయనో రాజ్యాంగ çసృష్టికర్తలా భ్రమ పడుతుంటాడు. ఎన్టీఆర్‌గారికి అసెంబ్లీలో మైకు ఇవ్వని వ్యక్తి జగన్‌ గారిపై విమర్శలు చేస్తాడు. విద్య, వైద్యాన్ని పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానిస్తాడు. నాడు నేడు పథకం కింద ఓవైపు పాఠశాలలకు కొత్తరూపునివ్వడమే కాకుండా 18 వైద్య కళాశాలలను కట్టిస్తూ, 40 వేల వైద్య సిబ్బంది నియామకం చేస్తూ.. విప్లవాత్మక ముఖ్యమంత్రిగా నిల్చిపోయేలా జగన్‌గారు రాష్ట్రాభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.
    కరోనా సమయంలో ప్రజలు సంపూర్ణంగా కోలుకునేలా చేసి, వారికి ఇంటికి వెళ్లడానికి కూడా ఖర్చులు ఇచ్చిన వ్యక్తి జగన్‌గారు. చివరకు యనమల నియోజకవర్గంలోని పాఠశాలలను కూడా బాగు చేస్తున్నది జగన్‌గారే. టీడీపీ హయాంలో బ్లాక్‌ బోర్డులు, కూర్చోడానికి బల్లలు కూడా లేని దుస్థితిని తప్పించి, ఈరోజు పాఠశాలలకు సరికొత్త రూపునిస్తున్నది జగన్‌గారే అని యనమల గుర్తించాలి.  

రాష్ట్ర విశాల హితం. జగన్‌గారి లక్ష్యం:
    రాజధానిపై మా ప్రభుత్వానికి గందరగోళం లేనేలేదు. పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణలే లక్ష్యంగా జగన్‌గారి ప్రభుత్వం ఉంది. పాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు. వీటికి జగన్‌గారు కట్టుబడి ఉన్నారు. రాష్ట్ర విశాల హితమే జగన్‌ గారి లక్ష్యం. 
    అమరావతిలో మీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సాగలేదని మా ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించి, కల్లబొల్లి మాటలు, గ్రాఫిక్స్‌తో మాయ చేసింది బాబు ప్రభుత్వం. 

బాబు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చాడా?:
    జాబ్‌ క్యాలెండర్‌ ప్రతి నెలా ప్రకటిస్తామని లోకేశ్‌ జనాన్ని మభ్యపెట్టాలని చూస్తున్నాడు. బాబు హయాంలో ఒక్కరికైనా ఉద్యోగమిచ్చిన దాఖలాలు ఉన్నాయా? జగన్‌ గారు 1.30 లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు, డీఎస్సీ ఉద్యోగాలు ఇస్తున్నది జగన్‌ గారే. పోలీసు ఉద్యోగాలు, గ్రూప్‌–1 ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు. బాబు వస్తే జాబ్‌ అని ప్రకటించారు. కాని ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేకపోయారు. ఇవన్నీ తెలిసినా తెలియనట్లు టీడీపీ నేతలు నటిస్తారు. నిత్యం జనాన్ని వంచించడమే టీడీపీ నేతల పని. 

జగన్‌ గారిని కాపీ కొడుతున్న బాబు:
    జగన్‌ గారిని కాపీ కొట్టే ప్రయత్నంలో.. తాము అధికారంలోకి వస్తే.. సాధికార సా«ర«ధులను నియమిస్తామని  తాజాగా చంద్రబాబు ప్రకటించాడు. గతంలో వలంటీర్ల వ్యవస్థను విమర్శించిన చంద్రబాబు, ఆ తర్వాత జగన్‌గారు మొదలుపెట్టిన గృహ సారధులను కూడా ఎగతాళి చేశాడు. అలా ఎగతాళి చేసిన రెండో రోజే.. తమ పార్టీ నుంచి ప్రతి 30 కుటుంబాలకు ఒక సాధికార సారథిని నియమిస్తామని ప్రకటించాడు. అందుకే చంద్రబాబుది ఎప్పుడూ కాపీ బ్రతుకే. 

ఫ్యాబ్రికేటెడ్‌ యాత్ర:
    అమరావతి టు అరసవెల్లి యాత్ర ఎందుకు ఆగిపోయింది? ఎందుకంటే వారిరి ఒక ఫ్యాబ్రికేటెడ్‌ ఆందోళన. అలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా అర్థంతరంగా ముగుస్తాయి. ఆ యాత్రలో పాల్గొనే వారు ఐడీ కార్డులు చూపాలన్న కోర్టు ఆదేశంతో, దాన్ని మధ్యలోనే ఆపేశారు. దీంతో తండ్రీ కొడుకులు మరో యాత్రలు మొదలుపెట్టారు. వారిని చూసి రాష్ట్రానికి ఇదేం ఖర్మరా అని  జనం, టీడీపీ కార్యకర్తలు నెత్తీనోరు కొట్టుకుంటున్నారు.   

జగన్‌గారు ఇచ్చిన మాటకు కట్టుబడతారు:
    ఎంత కష్టమైనా ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం జగన్‌గారి మహోన్నత తత్వం. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ఆగకుండా నిర్ణీత సమయంలో పథకాల సాయాన్ని నేరుగా అందిస్తున్నారు. టీడీపీ పాలనలో కన్నా వేయి రెట్లు మిన్నగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో మా ప్రభుత్వం ప్రగతి సాధించింది.

కట్టు తప్పి వ్యవహరించొద్దు:
    అందుకే ఇకనైనా ఈ నిజాలు గ్రహించి టీడీపీ నేతలు, చంద్రబాబు, లోకేశ్, అయ్యన్నపాత్రుడు జాగ్రత్తగా మాట్లాడాలని హితవు చెబుతున్నాం. మాట్లాడేటప్పుడు నోరు జారవద్దని హెచ్చరిస్తున్నాం. అలాగే చంద్రబాబు, లోకేశ్‌ ఇద్దరూ.. సంస్కారాన్ని అలవర్చుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే మేము అలాంటి రాజకీయాలకే కట్టుబడి ఉన్నాం. మీరు కట్టు తప్పి వ్యవహరించి, పిచ్చి మాటలు మాట్లాడితే అంతకు మించిన భాషను మేమూ ప్రయోగించాల్సి ఉంటుంది.

 మీకా అర్హత లేదు:
    టీడీపీ హయాంలో ఈఎస్‌ఐలో మందులు కొనమంటే స్నోలు, పౌడర్లు కొన్నారు. డబ్బులు కాజేశారు. వీళ్లా ప్రస్తుత ప్రభుత్వంలోభూ కుంభకోణాల గురించి మాట్లాడేది?  అన్ని రంగాలను కుదేలు చేసి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలించలేకపోయాడని అందరికీ తెలుసు.

అన్నీ అక్రమాలే:
    టీడీపీ హయాంలో ఫైబర్‌ నెట్‌ మొదలుకుని, మత్స్యకారులకు ఇచ్చిన వలల వరకు అన్నీ అవినీతి కుంభకోణాలే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత విస్తరించాం. పథకంలో మూడు వేలకు పైగా చికిత్స అందిస్తున్నాం. అలాగే అత్యవసర పరిస్థితుల్లో కీలకమైన 108 సర్వీసులు పెద్ద ఎత్తున కొనుగోలు చేశాం. అదే చంద్రబాబు హయాంలో వాటిని నిర్వహించలేక, మూలన పెట్టారు.

బాబు కలలు–అలాగే మిగులుతాయి:
    మళ్లీ తాను అధికారంలోకి వస్తానని చంద్రబాబు పగటి కలలు కంటున్నాడు. అవి కలలుగానే మిగిలిపోతాయి. ఆయన మాటలు ప్రజలు నమ్మడం లేదు. మతి స్థిమితం లేని బాబు మాటలకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? 3.5 లక్షల కోట్ల ఆస్తులు ఆవిరైపోయయని బాబు ఆరోపిస్తున్నాడు. అదంతా రియల్‌ ఎస్టేట్‌లో తమకు దక్కని ఆదాయంగా చంద్రబాబు విమర్శిస్తున్నాడు. 

స్టిక్కర్‌తో మీకేమిటి బాధ?:
    ఇంటింటికీ స్టిక్కర్‌ వేస్తే టీడీపీకి వచ్చిన బాదేంటి? మేము ఇంత ప్రగతి సాధించామని ఒక స్టిక్కర్‌ వేస్తే తప్పేంటి?. జగన్‌గారి స్టిక్కర్‌ గుండెలపై పడిందనే ప్రతిపక్షాల బాధ. కుల మత వర్ణ విచక్షణ లేకుండా అన్ని పథకాల ఫలితాలను అన్ని పార్టీలు పొందుతున్నాయని మాజీ మంత్రి   కన్నబాబు గుర్తు చేశారు.

Back to Top