వైయస్‌ఆర్‌ సీపీ నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు సస్పెండ్‌

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకపలాపాలకు పాల్పడుతున్నట్టుగా వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారుస్సుల మేరకు పార్టీ అధ్యక్షులు సీఎం వైయస్‌ జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. సుబ్బారాయుడును పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదలైంది. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top