టిడ్కో ఇళ్ళ పేరుతో కోట్లాది రూపాయల స్కామ్‌ చేసిన చరిత్ర బాబుది

పేదల సొంతింటి కలను నిజం చేసింది వైయస్‌ జగన్‌

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి కొమ్మూరి క‌న‌క‌రావు

తాడేప‌ల్లి:  టిడ్కో ఇళ్ళ పేరుతో కోట్లాది రూపాయల స్కామ్‌ చేసిన చరిత్ర చంద్ర‌బాబుది అంటూ వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి కొమ్మూరి క‌న‌క‌రావు ఫైర్ అయ్యారు. పేదల ఇళ్ళ గురించి మాట్లాడే నైతిక అర్హత టీడీపీ నేత‌ల‌కు లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. టీడీపీ నేతలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాల‌ని సూచించారు.అసెంబ్లీలో టిడ్కో ఇళ్ళపై చర్చ సందర్భంగా మంత్రి నారాయణ అవాస్తవాలు చెప్పార‌ని ఆక్షేపించారు. వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శ‌నివారం వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొమ్మూరి కనకారావు మీడియాతో మాట్లాడారు,   

స్కాములు చేసిన చరిత్ర చంద్రబాబుది

 టిడ్కో ఇళ్లలో చంద్రబాబు వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. పేదల కోసం కట్టించే ఇళ్లపైనా కక్కుర్తితో స్కాములు చేసిన చరిత్ర చంద్రబాబుది. పేదలపై భారం మోపుతూ, కనీసం మౌలిక వసతులు కల్పించకుండా పేదలపై చంద్రబాబు భారం మోపితే జగన్ గారి ప్రభుత్వం సకల హంగులు కల్పించి ఉచితంగా (రూ.1కే) అందించింది. రెండో కేటగిరీలో టిడ్కో ఇళ్లపై సబ్సిడీ ఇచ్చిన ఘనత జగన్ గారిది. మురుగునీటి పారుదల, తాగునీటి సౌకర్యం, కాంపౌండ్ వాల్స్ తదితర మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేసి లబ్ధిదారులకు అందించిన ఘనత కూడా జగన్ గారిదే. చంద్రబాబు స్కామ్, జగన్ గారు చేసిన మంచి గురించి లబ్ధిదారులందరికీ తెలుసు. టీడీపీ, బీజేపీ నాయకులు ఈ అంశం గురించి మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. 

20 ఏళ్ల పాటు వాయిదాలు కట్టాలని షరతు

 టీడీపీ ప్రభుత్వం తలపెట్టిన 5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ప్లాన్‌ చేసిన చంద్రబాబు ప్రభుత్వం 3.15 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలెట్టింది. తొలి విడతగా 2,08,160 యూనిట్లను 7,42,01,820 చ.అ. విస్తీర్ణంలో నిర్మాణ అనుమతులిచ్ఛిన చంద్రబాబు బృందం వేల కోట్ల అవినీతికి పాల్పడింది. పేదలు 300 చ.అ. ఇంటికి బాబు ప్రభుత్వం ఏకంగా రూ.7.20 లక్షలు భారం మోపి, 20 ఏళ్ల పాటు ప్రతినెలా వాయిదాలు కట్టాలని షరతుపెట్టింది. దీని ప్రకారం లబ్ధిదారులపై రూ.3,805 భారం మోపింది. 365 చ.అ. ఇంటికి రూ.50 వేలు, 430 చ.అ. ఇంటికి రూ.లక్ష చొప్పున ముందస్తుగా వసూలు చేసింది.  

జీ+3 విధానంలో ఫ్లాట్లు ఏవీ?

 ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు 2016–17లో రాష్ట్రంలో లేనంత అధికంగా నిర్మాణ వ్యయాన్ని చూపి లబ్ధిదారులను దోచుకున్నారు. ఏపీ టిడ్కో ద్వారా రాష్ట్రంలోని పట్టణాల్లో నివశిస్తున్న ఇళ్లు లేని పేదలు 5 లక్షల మందికి ప్రభుత్వ స్థలాల్లో 300, 365, 415 చ.అ విస్తీర్ణంలో జీ+3 విధానంలో ఫ్లాట్లు కట్టిస్తామని నమ్మబలికారు.  

 300 చ.గ. విస్తీర్ణం గల ఫ్లాట్‌కు రూ.2.60 లక్షల ధర నిర్ణయించి బ్యాంకు రుణాలు ఇప్పించి, నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు చెల్లించాలని (రూ.7.20 లక్షలు) షరతు పెట్టారు. ఇక్కడే చంద్రబాబు బృందం నిర్మాణ కంపెనీల నుంచి ముడుపులు తీసుకుని, అధికంగా ముడుపులు ఇచ్చుకున్న కంపెనీకి అధిక ధరకు, తక్కువగా ఇచ్ఛిన కంపెనీకి తక్కువ ధరకు నిర్మాణ అనుమతులు కట్టబెట్టారు. 

 ఈ అవినీతి లోతు ఎంతంటే.. ఆనాడు మార్కెట్‌లో ఏ ప్రైవేటు బిల్డర్‌ వసూలు చేయనంతగా ధర నిర్ణయించారు. 2016–17లో మార్కెట్‌లో చ.అడుగు నిర్మాణ ధర రూ.900 నుంచి రూ.1000 మధ్య ఉండగా.. చంద్రబాబు మాత్రం కంపెనీలకు రూ.2,534.75 నుంచి రూ.2034.59గా నిర్ణయించి సగటు చ.అ నిర్మాణ ధర రూ.2,203.45గా చెల్లించారు. అప్పటి మార్కెట్‌ ధరతో పోలిస్తే రూ.1203.45 అదనంగా నిరుపేదల నుంచి వసూలు చేశారు. వాస్తవానికి ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు మార్కెట్‌ ధర కంటే ఇంకా తగ్గాల్సింది పోయి భారీగా పెంచేశారు. 

వైయ‌స్ జ‌గ‌న్ టిడ్కో ఇళ్లు కేవలం 1 రూపాయికే ఇచ్చారు
 రూపాయికే 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లు అందించిన చరిత్ర జగన్ గారిది. రాష్ట్రవ్యాప్తంగా 1,43,600 మంది లబ్ధిదారులకు 300 చ॥అ॥ల టిడ్కో ఇళ్లు కేవలం 1 రూపాయికే అన్ని హక్కులతో అందజేశారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా పేద అక్కచెల్లెమ్మలకు రూ. 9,406 కోట్ల మేర లబ్ధి చేకూరింది. వైయ‌స్ జగన్ గారి ప్రభుత్వం 300 చ॥అ॥ల టిడ్కో ఇళ్లు కేవలం 1 రూపాయికే ఇస్తున్నందున రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులపై రూ.10,339 కోట్ల భారం తగ్గింది. 

  365 చ॥అ టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులు 44, 304 మందికి ఒక్కొక్కరికి రూ. 25 వేల చొప్పున, 74,312 మంది 430 చ॥అ టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులకు రూ. 50 వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా వారు ముందస్తు వాటాగా చెల్లించాల్సిన రూ.482 కోట్ల భారాన్ని జగన్ గారి ప్రభుత్వమే భరిస్తూ, మరో రూ.4,626 కోట్లను సబ్సిడీగా అందించింది. 

 చంద్రబాబు ప్రభుత్వం టిడ్కో ఇళ్ళు ప్రతిపాదించిన ప్రాంతాల్లో మంచినీటి సదుపాయం, రోడ్లు, విద్యుత్తు, డ్రైనేజ్ లాంటి మౌలిక వసతులను సైతం నిర్లక్ష్యం చేస్తే.. అన్ని మౌలిక సదుపాయాలతో ఇళ్లను కట్టించి మరీ జగన్ గారి ప్రభుత్వం అందించింది.  టిడ్కో ఇళ్ళకు రిజిస్ట్రేషన్లు కూడా ఉచితంగా చేశారు. తద్వారా ఒక్కో లబ్ధిదారుడికి ఉచిత రిజిస్ట్రేషన్ రూపేణా "మరో రూ. 60 వేల లబ్ధి చేకూరింది.

 రాష్ట్రవ్యాప్తంగా 2.62 లక్షల మంది టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులకు సబ్సిడీ రూపంలో రూ.11,672 కోట్లు అందించారు. ముందస్తు వాటా చెల్లింపులో 50 శాతం రాయితీగా రూ.482 కోట్లు, ఉచిత రిజిస్ట్రేషన్ల రూపంలో రూ.1200 కోట్లు లబ్ధి కలిగించారు. మౌలిక వసతులకు మరో రూ. 3,247 కోట్లు కలిపి మొత్తంగా రూ.16,601 కోట్ల మేర లబ్ధి కలిగేలా చేశారు.

ప్రజా ధనం ఆదా చేసిన వైయ‌స్ జగన్ ..
 బాబు హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలను గుర్తించిన జగన్‌ గారి ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా నిర్మాణ వ్యయాన్ని రూ.2,840 కోట్లకు తగ్గించించి. రూ.392 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసింది. రివర్స్‌ టెండరింగ్‌లో చ.అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ.1692 తగ్గించి, రూ.4,368 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేసింది. నిరుపేదలకు కేటాయించిన 300 చ.అ. ఇంటిని ఉచితంగా (రూ.1కి) ఇవ్వడంతో 1,43,600 మంది లబ్ధిదారులకు ఈఎంఐ రూపంలో చెల్లించే రూ.10,339 కోట్ల భారం లేకుండా పోయింది.  

 365 చ.అ ఇళ్లలో 44,304 మంది లబ్దిదారులు రూ.50 వేలు, 430 చ.అ. ఇళ్లలో 74,312 మంది లబ్దిదారులు రూ.లక్ష చొప్పున వాటా చెల్లించాలని చంద్రబాబు ప్రభుత్వం నిబంధన పెడితే, దాన్ని సగానికి తగ్గించి, మిగతా సగం వాటా నగదు రూ.482.32 కోట్లను వైయ‌స్ జగన్ గారి ప్రభుత్వమే చెల్లించింది. జగన్‌ ప్రభుత్వం ఉదారత ఫలితంగా రెండు, మూడు కేటగిరీల లబ్దిదారులకు గత ధరల ప్రకారం రూ.10,797 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఆ మొత్తం రూ.4,590 కోట్లకు జగన్‌ గారి ప్రభుత్వం తగ్గించింది. 

  2019 మే నాటికి 1,22,888 ఇళ్లను పునాదుల్లో, మరో 38,416 యూనిట్లు సగం శాతం కంటే తక్కువ పనులు చేసి చంద్రబాబు ప్రభుత్వం వదిలేసింది. 1,33,480 యూనిట్లను 100 శాతం పూర్తి చేసింది. 2024 మార్చి నాటికి 1,24,680 ఇళ్లను జగన్ గారి ప్రభుత్వం పంపిణీ చేసింది. 1,43,600 మందికి ఉచితంగానే ఇళ్లు కేటాయించింది.

సొంతింటి కల సాకారం చేసిన వైయ‌స్ జ‌గ‌న్‌
వైయ‌స్ జగన్ గారి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అక్కచెల్లెమ్మల సొంతింటి కలను సాకారం చేస్తూ 30.75 లక్షల ఇళ్ల పట్టాలను ఉచితంగా అందజేశారు. అందులో 21.76 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అందులో ఎన్నికల సమయానికి దాదాపు ౧౦ లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి, మరో నాలుగైదు లక్షల ఇళ్ళ నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. ఇదీ లబ్ధిదారులకు అందించిన చరిత్ర వైయ‌స్ జగన్  మోహ‌న్ రెడ్డిది అని క‌న‌కారావు పేర్కొన్నారు.

Back to Top