రాజకీయ అజ్ఞాని పవన్ కల్యాణ్  

మాజీ మంత్రి కొడాలి నాని

కృష్ణా: కనీస పరపక్వత లేని రాజకీయ అజ్ఞాని పవన్ కల్యాణ్ అని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఎన్టీఆర్, చిరంజీవిల పేర్లు వాడకుండా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికలకు వెళ్తే గుండు సున్నాతో సమానమని ఎద్దేవా చేశారు.   గుడివాడ 10వ వార్డులో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా ఒక్క శాతం కూడా ఓటు లేనీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ కలిసి పోటీ చేసి.. 60 శాతం ఓటింగ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఏం చేయగలర‌ని ప్ర‌శ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పీడ విరగడవుతుంద‌న్నారు. వచ్చే ఎన్నికల్లో​ చంద్రబాబు కూడా ఎమ్మెల్యేగా గెలవరు అని కామెంట్స్‌ చేశారు. 

  పవన్‌ కల్యాణ్‌ది జనసేన కాదు.. ధనసేన అని విశాఖ‌లో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విమ‌ర్శించారు . పేమెంట్‌ రాగానే పవన్‌ మూమెంట్‌ మారింద‌న్నారు. పవన్‌ కల్యాణ్‌ టీడీపీ పెయిడ్‌ ఆర్టిస్ట్ అని మండిప‌డ్డారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top