నెరవేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ హామీ.. 

దివ్యాంగుడికి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మంజూరు 
 

 చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరుకు చెందిన ఖలీల్‌ అనే దివ్యాంగుడికి సీఎం వైయ‌స్‌ జగన్‌ ఇచ్చిన హామీ నెరవేరింది. ఈ ఏడాది జూలైలో వరద ప్రాంతాల పర్యటనలో భాగంగా చింతూరు వచ్చిన ముఖ్యమంత్రిని ఖలీల్‌ కలిసి తనకు మూడు చక్రాల ఎలక్ట్రిక్‌ వాహనం మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రమిచ్చాడు.

దీంతో అతనికి రూ.90,000 విలువైన ఎలక్ట్రిక్‌ వాహనం మంజూరు చేస్తూ కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఇటీవల ఉత్తర్వులిచ్చారు. సబ్‌ కలెక్టర్, ఐటీడీఏ పీవో ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ ఆదేశాల మేరకు గురువారం స్థానిక ఐటీడీఏ కార్యాలయం వద్ద ఏవో రాజ్‌కుమార్‌ ఆ వాహనాన్ని ఖలీల్‌కు అందజేశారు. తనకు ఎలక్ట్రిక్‌ వాహనం మంజూరయ్యేలా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రికి ఖలీల్‌ కృతజ్ఞతలు తెలిపాడు.  

Back to Top