జగనన్న మాట చెబితే తప్పకుండా చేస్తాడు

కావ‌లి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాట చెబితే త‌ప్ప‌కుండా నెర‌వేర్చుతాడ‌ని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.  మేమంతా సిద్ధం కావలి బహిరంగ సభలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడారు.

ఎమ్మెల్యే ఏమ‌న్నారంటే..
అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ చూస్తుంటే జనసముద్రం కనిపిస్తా ఉంది. మన పక్కన సముద్రం ఉంది ఆ సాగర ఘోష వినపడదు కానీ జన హృదయ నేత, ఉప్పొంగిన జనసముద్రం హోరు సాక్షిగా మీముందు రెండు మాటలు మాట్లాడతాను. రామరాజ్యం, ధర్మరాజ్యం తర్వాత మనదేశ చరిత్రలో గుప్తుల రాజ్యంలో ఆకలి చావులు లేవు. అశోకుని కాలంలో కులమతాల వివక్షత లేదు. కాకతీయ రాజ్యంలో మహిళలదే ఎప్పుడూ పైచేయిగా ఉండేది. అదే రాయలవారి పాలనలో సమ సమాజం, వైద్య, విద్య, వ్యవసాయం అన్నీ కూడా సుభిక్షంగా ఉండేవి. ఇవన్నీ కూడా మనం చరిత్ర బుక్కుల్లో రాసుకున్నాం, చదువుకున్నాం. ఆ శకాలు, కాలాలు ముగిసిపోగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తా ఉన్నాం అభద్రత, అశాంతి, అవినీతి పెరిగిపోగా దేవుడా మా బ్రతుకులు బాగుచేయ్, దేవుడా మా కష్టాలు తీర్చవయ్యా అంటూ అభాగ్యుల ఆర్తనాదాలు మిన్నంటిన సమయంలో ఆ దైవం దిగిరాలేదు కానీ ఆంధ్రప్రదేశ్ ఆవేదనను తొలగించి అభాగ్యుల కష్టాలను, కన్నీటిని తుడిచే మన దూతగా, మన రాష్ట్రానికి వెలుగు చూపే రత్నాల దీపంగా జగనన్నను ఈ రాష్ట్రానికి పంపారు. రాయలసీమ గడ్డ పైనుంచి నడిచివచ్చే రాయలపాలన వారసుడిగా నవరత్నాల వెలుగులు అందరికీ పంచే సంక్షేమ దివిటి చేతబూని బడుగు, బలహీన భవిష్యత్తు వారధిగా మన ముందుకు వస్తున్నాడు మన జననేత జగనన్న.

మీ రాకతో మన కావలి, మా కావలి పులకించింది. నువ్వే మా నమ్మకమంటూ స్వాగతిస్తోంది. జయహో జగన్, జై జగన్ నినాదాలతో ఎన్నికల సమరంలో మీవెంట నడిచేందుకు మేమంతా సిద్ధమంటూ మా యువత, మా అక్కచెల్లెమ్మలు అంతా కూడా ఉరకలేస్తున్నారు. జనం గుండెల్లో గుడి కట్టడమే అజెండాగా మన ముందుకు వచ్చిన జగనన్న కోసం మనమంతా కూడా సిద్ధమా. శ్రామిక శక్తికి సంపద సమానంగా అందితేనే సంక్షేమరాజ్యం, ప్రజలు స్వయంగా సమృద్ధి సాధించాలన్నా గాంధీజీ స్వప్నాలు, ఆశయాలు సాధించాలన్నా అది జగనన్నకే సాధ్యం. కాబట్టి ఈరోజు మీ అందరికీ గుర్తుంది, జగనన్న మాట చెబితే తప్పకుండా చేస్తాడు. అదేవిధంగా ఈరోజు ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రిగా ఈదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగనన్నే అని మనమంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈరోజు జగనన్నను ఈ రాష్ట్రానికి మరలా మనం ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మీరందరూ కూడా సిద్ధమా. మన కావలి నియోజకవర్గానికి సంబంధించి జగనన్న.. రామాయపట్నం పోర్టు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన మత్స్యకారుల కోసం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లాంటి ప్రాజెక్టును కూడా ఇవ్వడం జరిగింది. మన కావలి నియోజకవర్గం అభివృద్ధిపథంలో దూసుకుపోవడమే కాకుండా ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతోందంటే అది ఒక్క జగనన్నకే సాధ్యమైందని తెలియజేస్తున్నాను. కాబట్టి మన కావలి ప్రజలు తప్పకుండా జగనన్న వెంట మనమంతా కూడా నడవాలి. జరిగే ఎన్నికల పోరాటంలో తప్పకుండా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు మనమంతా కూడా సిద్ధమా అని అడుగుతున్నాను.

 

Back to Top