తెలుగుజాతికి అందించిన అద్భుత కానుక కన్యాశుల్కం

ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి
 

అమ‌రావ‌తి: గురజాడ అప్పారావు తన మేధతో తెలుగుజాతికి అందించిన అద్భుత కానుక కన్యాశుల్కం అని ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి అన్నారు. గుర‌జాడ జ‌యంతి సంద‌ర్భంగా ఇవాళ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చేతుల మీదుగా క‌న్యాశుల్కం పుస్త‌కాన్ని ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ఆవిష్క‌రింప‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..125 సం.ల పూర్వం గ్రాంథికంలో కాకుండా వ్యవహారిక భాషలో నాటి సాంఘిక దురాచారాన్ని రూపుమాపాలన్న ఆలోచనతో అప్పటి రాజు ఆనందగజపతిరాజు సూచనతో, గురజాడ అప్పారావు తన మేధతో తెలుగుజాతికి అందించిన అద్భుత కానుక కన్యాశుల్కం. ఈ పుస్తకాన్ని గురజాడ 160 జయంతి రోజు సీఎం వైయస్ జగన్ ఆవిష్కరించడం సాహితీ అభిలాషులకు, మనిషిని ప్రేమించే, మానవతను గుర్తించే వారికి సంతోషకరమైన అంశమ‌ని భూమన కరుణాకరరెడ్డి అన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top