కూటమి నాయకులు ప్రలోభాలు మానండి

మంత్రాల‌యం ఎమ్మెల్యే వై బాలనాగి రెడ్డి

ఇంటి స్థలాలు ఇస్తామ‌ని మోస‌పూరిత మాట‌ల‌తో న‌మ్మించి టీడీపీ కండువాలు వేశారు 

టీడీపీని వీడి తిరిగి వైయ‌స్ఆర్‌సీపీలో చేరిన కామనదొడ్డి కార్యకర్తలు 

క‌ర్నూలు: కూటమి నాయకులు ప్రలోభాలు మానుకోవాల‌ని మంత్రాల‌యం ఎమ్మెల్యే వై.బాల‌నాగిరెడ్డి హెచ్చ‌రించారు. ప్ర‌లోభాల‌తో టీడీపీలో చేరిన కోసిగి మండ‌లం కామ‌న‌దొడ్డి కార్య‌క‌ర్త‌లు తిరిగి వైయ‌స్ఆర్‌సీపీ గూటికి చేరుకున్నారు. ఎమ్మెల్యే  వై బాలనాగి రెడ్డి,యువనేత వై ధరణీ రెడ్డి,మండల ఇంచార్జీ  పి మురళీ మోహన్ రెడ్డి అదేశాల మేరకు   కండువా కప్పి పార్టీలోకి నరసింహులు గౌడ్ పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా న‌ర‌సింహులు గౌడు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వ నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం సామాన్య ప్రజలను ప్రలోభాలతో మోసం చేయడం తగదని హెచ్చ‌రించారు. గత రెండు రోజుల క్రితం దాదాపు 90 కుటుంబాలు టీడీపీలో చేర్చుకుని కూటమి నాయకులు గొప్పలు చెప్పుకున్నార‌ని విమ‌ర్శించారు.  కామనదొడ్డి సర్పంచ్ మునెమ్మ అధ్యక్షతన ఎవరైతే పార్టీ విడినారని చెప్పినారో హరిజన అడివప్ప, యల్లప్ప,అబ్రహం, పరమేష్,దాసరి అంజినయ్య,పింజారి బాషా,రహిమాన్,ఉసేని తో దాదాపు 20 కుటుంబాలు తిరిగి వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయ‌ని చెప్పారు. ఇంటి స్థలాలు 3 సెంట్లు ఇస్తామని, క‌రెంటు బిల్లులు ఇస్తామని,  కాంపౌండ్ వాల్, బోర్లు వేయించి ఇస్తామని మోసపూరిత మాటలను నమ్మి, మోసపోయామని, ఆ తప్పును తెలుసుకొని, ఈరోజు తిరిగి సొంత గూటికి రావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇందులో ఎవరి ప్రోద్బలం లేదని, మాలాగా కూటమి నాయకుల మాటలు నమ్మి, ఎవ్వరూ మోసపొవద్దని వారు తెలిపారు.

Back to Top