అమరావతి మీద మాట్లాడితే నోటికి తాళాలు వేస్తారా? 

మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ఫైర్‌
 
వరదలు రాకుండా కృష్ణానదికి తాళం వేయాలి

ఇంగ్లీషు మీడియం రద్దు, టోఫెల్, ఐబీ, సీబిఎస్ఈలను రద్దు  

తాడేపల్లి: అమరావతి మీద మాట్లాడితే నోటికి తాళాలు వేస్తారా? అంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబుకు ప్రస్టేషన్‌ ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. అమరావతి మునగదని చంద్రబాబు ఎందుకు చెప్పటం లేదని నిలదీశారు.  సూపర్ సిక్స్ హామీలు అమలు చేయనందున చంద్రబాబును గాడిదల మీద ఊరేగించాలని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.  తాడేప‌ల్లిలోని కేంద్ర కార్యాల‌యంలో కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

జనం నోళ్లకు తాళం వేయటం కాదని, వరదలు రాకుండా కృష్ణానదికి తాళం వేయాలని చురకలంటించారు. వర్షాలు కురవకుండా ఆకాశానికి తాళం వేయాలని సెటైర్లు వేశారు. జనాలకు వాస్తవాలు తెలుస్తున్నాయని బాబు ప్రస్టేషన్‌లోకి వెళ్లిపోయారని విమర్శించారు.  అమరావతిలోకి నీళ్లు వస్తున్నాయంటే కోపం ఎందుకని ప్రశ్నించారు.

‘మెడికల్ కాలేజీలను ప్రయివేటుపరం చేయటంతో విద్యార్థులకు తీరని అన్యాయం. రైతులు అల్లాడిపోతున్నా పట్టింపులేదు. విద్యారంగం పూర్తిగా తిరోగమనం పట్టింది. ఇంగ్లీషు మీడియం రద్దు చేశారు. టోఫెల్, ఐబీ, సీబిఎస్ఈలను రద్దు చేసి విద్యార్థుల జీవితాలను నాశనం చేశారు. ప్రజారోగ్యానికి ఉరి వేశారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌కు మంగళం పాడారు. విలేజ్ క్లినిక్ లకు గ్రహణం పట్టించారు’అని కాకాని మండిపడ్డారు.

Back to Top