రహదారుల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదు  

కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి 

అనంత‌పురం: రహదారుల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేద‌ని కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి అన్నారు. సోమ‌వారం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో గత 30 సంవత్సరాలలో ఎన్నడూ జరిగినటువంటి అభివృద్ధి చేశామన్నారు.  వారి సహకారంతో అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలం నుంచే కదిరి ప్రజల స్వప్నంగా మిగిలిపోయిన బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టి రూ.230 కోట్లతో త్వరలోనే పూర్తి చేయబోతున్నమన్నారు. కాలేజీ సర్కిల్ నుంచి చావడి వరకు రోడ్డు విస్తరణ పనులు చేశాం, కదిరి మున్సిపాలిటీలో నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్మించాం, 18 కోట్ల రూపాయలతో స్థానిక ఏరియా ఆసుపత్రి అద్భుతమైన భవనాన్ని నిర్మించుకుంటున్నామ‌ని తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్ ను నిర్మించాం, ప్రతి వార్డులో ఇంటర్నల్ రోడ్లను వేసాం,   గడపగడప మ‌న ప్ర‌భుత్వం కార్యక్రమం ద్వారా ప్రతి సచివాలయం పరిధిలో 20 లక్షలతో పనులు చేపట్టమన్నారు.  కదిరి  నియోజకవర్గ వ్యాప్తంగా రూ. 100 కోట్ల రూపాయలకు పైగా నిధులు వెచ్చించి 150 గ్రామాలకు తారు రోడ్లు, సిమెంట్ రోడ్లను అప్రోచ్ రోడ్లను వేసామన్నారు.  63 సచివాలయాల పరిధిలో స‌చివాల‌య భ‌వ‌నాలు, రైతు భరోసా కేంద్రాలను, వెల్నెస్ సెంటర్లను నిర్మించాం, నిర్మించుకోబోతున్నామన్నారు.

70 సంవత్సరాల ముందు నిర్మించిన తలుపుల నంబులపూలకుంట  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థానం లో నూతన భవనాలను నిర్మించుకుని ప్రారంభిచుకున్నామన్నారు.  నాడు- నేడు కార్యక్రమాల ద్వారా నియోజకవర్గంలోని ప్ర‌భుత్వ పాఠశాలను, ఆసుప‌త్రుల‌ను ఆధునికీకరించుకున్నామన్నారు.  ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గంలో గత 30 సంవత్సరాలలో ఎన్నడైనా కార్యక్రమాలు చేశారా అని ఆలోచించాలి.  తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్న సమయంలో 9 సంవత్సరాలు ఎక్కడైనా కూడా రోడ్ల‌పై గంపెడు మట్టి వేశారేమో ఆలోచించుకోండి! రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి పనులు చేయలేదని గుంతలు ఉన్నాయి చెప్పడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. 

మీ ఇంటి ముందు గతంలో అధికారం లేకపోయినా పెత్త‌నం చెలాయించిన 5 సంవత్సరాలు అంతకుమునుపు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న రోజులలో ఏనాడైనా నీ ఇంటి ముందు ఉన్న రోడ్డును వేయాలా అన్న ఆలోచన వచ్చిందా? మీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్డు వేస్తుంటే కోర్టులకు వెళ్లి ఆపి నేడు రోడ్లు గుంతలు ఉన్నాయని మీరు మీ తోకపార్టీలు కలిసి రోడ్లమీద కోస్తారా?  అన్ని రోజుల అన్ని రోజులు నీ బుద్ధి ఏమైందో చెప్పాలన్నారు.  మీరు చేసే పనులు వేరే ఉన్నాయని వాటిని చేసుకోమన్నారు. 

కదిరి నియోజకవర్గ అభివృద్ధి గురించి కదిరి రోడ్ల గురించి మాట్లాడే కనీస నైతిక హక్కు మీకు లేదని ఎమ్మెల్యే అన్నారు. గతంలో కోనేరు పనులు చేపట్టి పూర్తి అయిన సమయంలో ఒకేరోజు 18 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో కోనేరు దెబ్బతినిపోవడం ప్రజలంతా గమనించారన్నారు.  మ‌ళ్లీ నేడు కోనేరు అభివృద్ధి పనులు చేపట్టామని కొన్ని టెక్నికల్ సమస్యల ద్వారా పనులకు అంతరాయం కలుగుతుండడంతో ఆలస్యం అవుతున్నదన్నారు. హంద్రీనీవా జలాల ద్వారా నియోజకవర్గంలో ప్రతి చెరువుకు నీరు అందించే కార్యక్రమంలో భాగంగా తలుపుల నంబులపూలకుంట చెరువులకు నీటిని అందించేందుకు మిగిలిపోయినటువంటి పనులు పూర్తి చేసి గత ఏడాది నీటిని విడుదల చేశామని, నేటి సంవత్సరం కూడా విడుదల చేస్తున్నామన్నారు.  

గాండ్లపెంట మండలానికి నీటిని అందజేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో రూ. 44.44 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ద్వారా అందరిని నివాజలాలను అందజేసేందుకు త్వరలోనే టెండర్లను పిలిచపోతున్నామన్నారు.  మీరు అధికారంలో ఉన్నన్ని రోజులు ఏనాడైనా ఒక చెరువుకైనా నీరు అందించారని ప్రశ్నించారు.  మేము చేయవలసిన పనిలో కేవలం రెండే రెండు పనులు మిగిలిపోయి ఉన్నాయని ఒకటి  నంబులపూలకుంట కదిరి రోడ్డు విస్తరణ పనులు, రెండు శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం కోనేరు పనులు వీటిని కూడా త్వరలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.  

మీడియా మిత్రులతో కలిసి కదిరి నియోజకవర్గం లో గల అభివృద్ధి పనులను చూపించేందుకు ఒక టూర్ వేస్తామని ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్క మీడియా సోదరుడు హాజరుకావాలని తెలియజేశారు.  ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే నిర్మాణంలో ఉన్నటువంటి రోడ్ల దగ్గరికి వెళ్లి సెల్ఫీలు దిగి పనులు చేయలేదని ప్రజలను మభ్య పెట్టెందు చూస్తున్నారాన్నారు.  ప్రజలకు ఎవరు మంచి చేస్తున్నారు తెలుసని వారు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తారని ఎమ్మెల్యే డాక్ట‌ర్ సిద్ధారెడ్డి పేర్కొన్నారు.

Back to Top