కదిరి బాబూరావు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

తాడేపల్లి: టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో కదిరి బాబూరావు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. కదిరి బాబూరావు ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు. బాబూరావు వైయస్‌ఆర్‌సీపీలో చేరడంతో ప్రకాశం జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని జిల్లా నాయకులు పేర్కొన్నారు.

Back to Top