తాడేపల్లి: విద్య, ఆరోగ్యం వంటి వాటిపై సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చాలా ఫోకస్ చేశారంటూ గుంటూరు జిల్లాకు చెందిన జూనియర్ న్యాయవాది శశిధర్ ముఖ్యమంత్రికి హ్యట్సాఫ్ చెప్పారు. అర్హులైన జూనియర్ న్యాయవాదులకు సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైయస్ జగన్ స్టైఫండ్ జమ చేశారు. ఈ సందర్భంగా వర్చువల్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన జూనియర్ న్యాయవాదులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే శశిధర్, జూనియర్ అడ్వకేట్, గుంటూరు నమస్కారం సార్, నేను గుంటూరు జిల్లా కోర్టులో జూనియర్ అడ్వకేట్‌గా సర్వీసెస్ ప్రారంభించాను, నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను, మా నాన్న ప్రైవేట్ ఉద్యోగి, మమ్మల్ని చదివించడమే కష్టంగా ఉండేది, మీరు ప్రవేశపెట్టిన విజనరీ స్కీమ్స్ గురించి సచివాలయంలో అన్నీ తెలుసుకున్నాను, విద్య, ఆరోగ్యం వంటి వాటిపై మీరు చాలా ఫోకస్ చేశారు, హ్యట్సాఫ్ సార్, నేను ఇటీవల ఆరోగ్య సురక్ష క్యాంప్ కు వెళ్ళాను, చాలా బావుంది, దేశమంతా ఏపీ వైపు చూస్తోంది, మన స్కీమ్స్‌ను వేర్వేరు పేర్లతో కాపీ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారి వల్ల కాదు, విదేశీ విద్య చాలా బావుంది, తాజాగా తుపాను వచ్చిన సమయంలో మీరు ఇచ్చిన సపోర్ట్, భరోసా చాలా నచ్చింది, మిమ్మల్ని మార్గదర్శకంగా తీసుకుని మేం కూడా పేదలకు సాయం చేయాలనుకుంటున్నాం, మీరు ఒక విజనరీ, రాబోయే తరాలకు రోల్ మోడల్ మీరు, మీరు ఇచ్చే స్టైఫండ్ చాలా ఉపయోగపడుతుంది, మా కాళ్ళపై మేం నిలబడుతున్నాం, మేం అదృష్టవంతులం, మళ్ళీ కూడా మీరే సీఎం కావాలని కోరుకుంటున్నాం, థ్యాంక్యూ సార్. కోట ఆశ్రిత, జూనియర్ అడ్వకేట్, నందిగామ నమస్తే సార్, నేను మీ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నాను, నాకు చాలా ఉపయోగపడుతుంది, మా నాన్న ఆర్టీసీ ఉద్యోగి, ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేయడంతో చాలా సంతోషపడ్డాం, మేం ఈ డబ్బును కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్‌కు, బుక్స్ కోసం, రవాణా ఖర్చుల కోసం ఉపయోగించుకుంటున్నాం, ఈ వృత్తిలో ఎలా రాణించగలమా అని భయపడ్డాం కానీ ఈ స్కీమ్ మాకు ధైర్యాన్నిచ్చింది, మా జూనియర్స్‌కు కూడా ధైర్యం చెబుతున్నాం. గుప్తుల స్వర్ణయుగాన్ని నేను చూడలేదు కానీ మీ పాలనలో చూడగలిగాను, చాలా సంతోషం, మీరు ఇచ్చే అన్ని పథకాలు మాకు అందుతున్నాయి, ధ్యాంక్యూ.