రైతుకు ఓ రోజు

దివంగ‌త మ‌హానేత వైయ‌స్ఆర్ జ‌యంతి రోజు రైతు దినోత్స‌వం

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న అన్న‌దాత‌లు 

అమ‌రావ‌తి:  సంక్షేమానికి మారుపేరుగా నిలిచిన ఒక‌ప్ప‌టి మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిగారి కుమారుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. తాను కూడా ఆ తండ్రి బాట‌లోనే న‌డుస్తాన‌ని నిరూపిస్తున్నారు. రైతుబాంధ‌వుడిగా పేరున్న వైఎస్సార్ మాదిరిగానే వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిగారు కూడా ముఖ్య‌మంత్రిగా అధికారం చేప‌ట్ట‌గానే రైతుల కోసం తాను హామీ ఇచ్చిన ప్ర‌తి ప‌థ‌కాన్నీ అమ‌ల్లోకి తెస్తున్నారు. ప‌గ‌లే 9 గంట‌ల ఉచిత విద్యుత్, పెట్టుబ‌డి కోసం ఏటా 12,500 రూపాయిలు అందించ‌డం వంటి న‌వ‌ర‌త్నాల హామీల‌ను నెర‌వేరుస్తున్నారు. 
రైతుల‌పై అంతులేని ప్రేమ‌ను క‌న‌బ‌రిచేవారు వైఎస్సార్. అదే తీరులో రాజ‌న్న బిడ్డ సైతం అన్న‌దాత‌ల‌పై త‌న అక్క‌ర క‌న‌బ‌రుస్తున్నారు. అన్ని వ‌ర్గాల‌కూ, అన్ని వృత్తుల‌కూ సంబంధించి రోజులున్నాయి కానీ అన్న‌దాల‌కంటూ ఒక రోజు లేదు. అందుకే వైఎస్సార్ జ‌యంతి రోజును రైతు దినోత్స‌వంగా ప్ర‌క‌టించాల‌ని వైఎస్సార్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఏటా వైఎస్సార్ జ‌యంతి రోజైన జులై 8 వ తేదీన రైతు దినోత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు. రైతుల‌కు ప్రభుత్వం అందించ‌నున్న పంట బీమా, వ‌డ్డీలేని రుణాల‌ను ఆ రోజే అందించేలా అధికారుల‌కు ఆదేశాలు ఇచ్చారు. న‌వ‌రత్న‌ల్లోని మ‌రో హామీ భ‌రోసా పింఛ‌న్లు కూడా అదే రోజు పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు ప్ర‌భుత్వ అధికారులు చెబుతున్నారు.

నిజానికి ఈ నిర్ణ‌యం అనంత ప్ర‌జ‌లు ఎప్పుటి నుంచో ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్న‌దే. అనంత‌పురానికి చెందిన రైతులు వైఎస్ గారి మ‌ర‌ణానంత‌రం ఆయ‌న జ‌యంతిని రైతు దినోత్స‌వంగా ప్ర‌క‌టించాలంటై ప్ర‌భుత్వానికి విన్న‌వించారు. కానీ గ‌త ప్ర‌భుత్వాలేవీ ఆ డిమాండ్ ను ప‌ట్టించుకోలేదు. సంక్షోభంలో ఉన్న వ్య‌వ‌సాయ రంగానికి ఊపిరి పోసిన వైఎస్సార్ జ‌యంతి రైతు జ‌యంతిగా జ‌ర‌పుకోవ‌డం రైతులంద‌రికీ సంతోషాన్ని క‌లిగించే విష‌యం అంటున్నారు. ముఖ్య‌మంత్రి అయిన వెంట‌నే వ్య‌వసాయానికి ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంత‌కం చేసి రైతు బాంధ‌వుడిగా అన్న‌దాత‌ల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు రాజ‌శేఖ‌ర్ రెడ్డి. పాత విద్యుత్ బ‌కాయిల‌ను మాఫీ చేసి, చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రైతుల‌పై పెట్టిన కేసులు ర‌ద్దు చేసారు. అప్పుల‌పాలై ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు అప‌ర‌భ‌గీర‌దుడై జ‌ల‌య‌జ్ఞాన్ని ప్రారంభించారు.ల‌క్ష‌లాది ఎక‌రాల బీళ్ల‌ను స‌స్య‌స్యామ‌లం చేసారు.  అన్ని అనుమ‌తులూ తెచ్చి పోల‌వ‌రాన్ని ప్రారంభించారు. రుణ‌మాఫీ, పావ‌ల‌వ‌డ్డీ రుణాలు, స‌బ్సిడీలు, సేద్య‌ప‌రిక‌రాల‌ను అందించ‌డం ద్వారా వ్య‌వ‌సాయానికి ప్రోత్సాహాన్ని అందించారు. రైతు ప‌క్ష‌పాతిగా పేరు గాంచిన  వైఎస్సార్ స్వ‌ర్ణ‌యుగాన్ని త‌ల‌పించేలా నేటి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్న‌దాత‌ల‌కు అండ‌గా నిలుస్తున్నారు. నిత్య కృషీవ‌లురైన రైతులే దేశానికి వెన్నెముక‌ల‌ని న‌మ్మి వారికి చేయూత అందించే ప్ర‌భుత్వ‌మే అస‌లైన ప్ర‌భుత్వం. అలాంటి పాల‌కులే నిజ‌మైన పాల‌కులు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top