అంతా గప్‌చుప్‌

ఏపీలో కొనసాగుతున్న జనతా కర్ఫ్యూ..  

ఇళ్లకే పరిమితమైన ప్రజలు

కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌:  కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) నివారణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ‘జనతా కర్ఫ్యూ’ కొనసాగుతోంది. సామాజిక దూరం పాటిస్తేనే భారత్‌ కోవిడ్‌ పోరులో విజయవంతమవుతుంది. ఇందులో భాగంగా  ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలందరూ ఇళ్లలోనే గడపాలని ప్రధాని మోదీ కోరారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కట్టదిట్టమైన చర్యలు చేపట్టింది. సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అప్రమత్తమై కరోనా వ్యాప్తి కట్టడికి కదంతొక్కుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో జనతా కర్ఫ్యూపై లైవ్‌ అప్‌డేట్స్‌..

 విజయవాడ ప్రజలంతా జనతా కర్ఫ్యూ భాగమయ్యారు. అపార్ట్‌మెంట్లలోని జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ మార్నింగ్ వాక్ చేసేవారితో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం జనతా కర్ఫ్యూతో బోసిపోయింది. 
ప్రకాశం వాసులు జనతా కర్ఫ్యూకు జైకొట్టారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. 
కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) నియంత్రణలో భాగంగా ఏపీలో ‘జనతా కర్ఫ్యూ’

  • ఏపీలో సమన్వయంతో పనిచేస్తున్న అన్ని ప్రభుత్వ విభాగాలు
  • రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్చందంగా సేవలు నిలిపివేసిన పెట్రోల్ బంకులు
  • రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసి బస్టాండ్‌లలో నిలిచిపోయిన బస్సు సర్వీసులు
  • విజయవాడ, తిరుపతి, విశాఖ, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు నగరాలతో పాటు అన్ని ప్రధాన పట్టణాల్లో మాల్స్ మూతపడ్డాయి.
  • ప్రభుత్వ కార్యాలయాలు, జన సంచారం అధికంగా వున్న ప్రాంతాల్లో శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మున్సిపల్, పంచాయతీ కార్మికులు 
  • విజయవాడలోని ఆర్టీఏ అధికారులు తాత్కాలికంగా లెర్నింగ్ లైసెన్స్ పరీక్షలను నిలిపివేశారు. 
  • అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. పిల్లలు, గర్భిణీలకు ఇళ్ళకే పోషకాహారం పంపిణీ చేస్తున్నారు.
  • ‘జనతా కర్ఫ్యూ’ కారణంగా ఎక్సైజ్ శాఖ డ్రై డేగా ప్రకటించింది.
  • ఎక్సైజ్ శాఖ.. ఎక్సైజ్ చట్టం 20(1) ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసింది.
  • రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు మూత పడ్డాయి. పర్యాటక ప్రాంతాలను తాత్కలికంగా అధికారులు మూసివేశారు.
  • బొర్రా గుహలు, శ్రీశైలం రోప్‌వే, విజయవాడ భవానీద్వీపం తదితర ప్రముఖ ప్రాంతాల్లో ఈ నెల 31వ తేదీ వరకు పర్యాటకులకు అనుమతిని అధికారులు నిరాకరించారు. 
  • అన్ని ప్రముఖ దేవాలయాల్లోనూ భక్తులకు అనుమతి రద్దు చేశారు. ప్రైవేటు ట్రావెల్స్ సర్వీసులను స్వచ్చందంగా రద్దు చేశాయి. 
  • ‘జనతా కర్ఫ్యూ’ కు మద్దతుగా హోల్ సేల్ మార్కెట్లు మూతపడ్డాయి. విజయవాడలోని వస్త్రలత మార్కెట్‌ను 31వరకు మూసి వేయనున్నట్లు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రైతు బజార్లు, మార్కెట్‌లలో స్వచ్చందంగా రైతులు, వ్యాపారులు ‘జనతా కర్ఫ్యూ’ పాటిస్తున్నారు. 
  • జనతా కర్ఫ్యూలో భాగంగా విజయవాడ హోల్ సేల్ కూరగాయల మార్కెట్ నిర్మానుష్యంగా మారింది.

తాజా వీడియోలు

Back to Top