గుడివాడలో పేర్నినాని కారుపై రాళ్ల దాడి

అమరావతి :  గుడివాడలో మాజీ మంత్రి పేర్ని నాని కారుపై రాళ్ల దాడి కలకలం రేపుతుంది. వైయ‌స్ఆర్‌సీపీ నేత  తోట శివాజీ  మాజీ మంత్రి పేర్ని నాని,మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ వెళ్లారు. ఆ ఇద్దరు నేతలు శివాజీ ఇంట్లో ఉన్న సమయంలో.. ఇంటి బయటే టీడీపీ, జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. పరుష పదజాలంతో దూషిస్తూ.. తాము దాడి చేసేందుకు వచ్చామంటూ హెచ్చరికలు జారీ చేశారు.

టీడీపీ, జనసేన నేతల దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయినప్పటికీ వారిని నిలురించే ప్రయత్నం చేయలేదు. సుమారు రెండు గంటలకు పైగా పేర్నినాని శివాజీ ఇంట్లోనే ఉన్నారు.

ఏపీలో ఆటవిక పాలన, రెడ్‌బుక్‌ రాజ్యాంగం

ఏపీలో ఆటవిక పాలన, రెడ్‌బుక్‌జ్యాంగం కొనసాగుతోంది. గుడివాడలో మాజీ మంత్రి పేర్ని నాని లక్ష్యంగా రెండు సార్లు దాడులకు పాల్పడ్డారు టీడీపీ, జనసేన నేతలు. కారుపై దాడిచేసి అద్ధాలు పగలగొట్టారు టీడీపీ, జనసేన నాయకులు. పోలీసుల సమక్షంలో దాడులకు పాల్పడ్డారు.

సోషల్‌ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్‌కు అండగా ఉండేందుకు న్యాయ సహాయం కోసం పేర్ని నాని, కైలే అనిల్‌లు గుడివాడ వెళ్లారు. ఈ క్రమంలోనే పేర్ని నాని కారుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు కూటమి నేతలు. టిడ్కో గృహాల వద్ద మరో కారును  పేర్ని నాని డ్రైవర్‌ ఉంచగా. అక్కడకు వెళ్లిమరీ కారుపై దాడికి పాల్పడ్డారు.  

Back to Top