సత్యవేడులో వైయస్ఆర్‌సీపీ జనాగ్రహ దీక్షలు

చిత్తూరు: సత్యవేడు పట్టణంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షలు ప్రారంభించారు. ప‌ట్ట‌ణంలోని మూడు కూడ‌ళ్ల రోడ్డు లో గాంధీ విగ్రహం నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. టీడీపీ పార్టీకి చెందిన పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా నాయకులు మండల స్థాయిలో రెండు రోజుల దీక్ష చేపట్టారు. బూతు వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలనే డిమాండ్‌తో జనాగ్రహ దీక్షలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మితిమీరిన పదజాలంతో మాట్లాడుతూ లేనిపోని కుయుక్తులు చేస్తు ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపడుతున్నారు అని అన్నారు. శాంతియుత మేధావి అయినటువంటి గాంధీ విగ్రహానికి  పూలమాలవేసి శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్ సీపీ మండల అధ్యక్షుడు సుశీల్ కుమార్ రెడ్డి , జెడ్పిటిసి విజయలక్ష్మి చంద్రశేఖర్రెడ్డి, వ్యవసాయ కమిటీ చైర్మన్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఎంపిటిసిలు సర్పంచ్లు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top