కాకినాడ జిల్లా: మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పలువురు టీడీపీ, జనసేన నేతలు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్ఆర్‌సీపీలో చేరారు. కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్.టి.రాజపురం నైట్ స్టే పాయింట్ వద్ద జనసేన, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేతలు. నెల్లూరు జిల్లా జనసేన, తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి. జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, నెల్లూరు మండల అధ్యక్షుడు కాటంరెడ్డి జగదీష్ రెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ యాదవ్, తెలుగుదేశం పార్టీ ఉదయగిరి మండల మాజీ ఎంపీపీ చేజెర్ల సుబ్బారెడ్డి తదితరులు సీఎం వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ అభ్యర్ధి వి విజయసాయిరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదాల ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు. ప్రత్తిపాడు నియోజవర్గం టీడీపీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏలేశ్వరం నగర పంచాయితీకి చెందిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పైలా సత్యనారాయణ కుమారుడు పైలా బోసు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు సతివాడ రాజేశ్వరరావు, టీడీపీ కౌన్సిలర్ జి.వీర్రాజు, చింతల పాండవులు, పలువురు ఇతర నేతలు పార్టీ నేతలకు అధినేత దిశానిర్దేశం ఎస్.టీ.రాజపురం స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్.జగన్ ను కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిశారను. పలువురు పార్టీ నేతలు, సీనియర్ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ.... యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్.ఈ సందర్భంగా ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయాలని పార్టీ నేతలకు సీఎం వైయస్ జగన్ దిశా నిర్దేశం చేశారు. రంగంపేట చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్ 18 వ రోజు బస్సుయాత్ర. ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికిన మహిళలు. దారిపొడవునా మేమంతా సిద్ధమంటూ ముఖ్యమంత్రి సంఘీభావం తెలిపిన ప్రజలు.