ప్ర‌తీ ఇంటిలో ‘జగనన్నే మా భవిష్యత్తు’

రాష్ట్ర‌వ్యాప్తంగా మా భవిష్యత్తు జగనన్నే కార్య‌క్ర‌మం ప్రారంభం

ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తున్న గృహ సార‌ధులు, వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు

 

    

అమ‌రావ‌తి: మాట నిలబెట్టుకుంటూ 46 నెలల్లో 98.5 శాతం ఎన్నికల హామీలను అమలు చేసి మేనిఫెస్టోకు సిసలైన నిర్వచనం ఇచ్చారు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి . అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కూడా గడవక ముందే సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో నేరుగా రూ.2 లక్షల కోట్లు జమ చేశారు. వార్డు మెంబర్‌ నుంచి కేబినెట్‌ వరకూ సింహభాగం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారు. నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకు, మహిళలకు రిజర్వ్‌ చేస్తూ చట్టం తెచ్చి మరీ చిత్తశుద్ధి చాటుకున్నారు.

 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు.. 2.60 లక్షల మంది వలంటీర్లు.. 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరణతో పరిపాలనను వికేంద్రీకరించి ఇంటివద్దే సుపరిపాలన అందిస్తున్నారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆదర్శ పాలనతో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచారు. ఇదే అంశాన్ని చాటి చెబుతూ టీడీపీ సర్కార్‌కు, వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ మరోసారి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతూ ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి శుక్ర‌వారం శ్రీకారం చుట్టారు.   రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో  ‘జగనన్నే మా భవిష్యత్‌’ కార్య‌క్ర‌మం ప్రారంభించారు. సచివాలయానికి ముగ్గురు చొప్పున నియమించిన కన్వినర్లు, ప్రతి 50 నుంచి వంద ఇళ్లకు ఇద్దరు చొప్పున నియమించిన గృహ సారథులతో కూడిన ఏడు లక్షల మంది సైన్యం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.  ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఆయా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తున్నారు. 14 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా 15,004 సచివాలయాల పరిధిలో 1.60 కోట్ల కుటుంబాలలోని ఐదు కోట్ల మంది ప్రజలను కలుసుకోనున్నారు. 

కృష్ణా జిల్లా

►పెడనలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని మంత్రి జోగి రమేష్ ప్రారంభించారు.. 
►మా భవిష్యత్తు జగనన్నే అనేది ప్రజల ఆకాంక్ష: మంత్రి జోగిరమేష్
►భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత అభివృద్ధి కార్యక్రమాలను ఏపీలో సీఎం జగన్ చేస్తున్నారు
► బటన్ నొక్కగానే రైతులు , అక్కచెల్లెమ్మల అకౌంట్లలలోకి డబ్బులు జమ అయ్యేలా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు
► ప్రతీ గడపకూ వెళ్లి ప్రభుత్వం పట్ల ఎంత సంతృప్తిగా ఉన్నారో అడిగి తెలుసుకుంటాం.

కర్నూలు.

కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ కామెంట్స్
► ప్రభుత్వ చేసినా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి తీసుకెళ్తాం.
►  ప్రతి గడప గడపకు ప్రభుత్వం మేలు గురించి తెలియజేస్తున్నాం.
► రాష్ట్రంలో అవినీతి రహిత పాలనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్నారు.
► ఒక్క వైపు సంక్షేమ, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు.
► చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి.
► వారి దుష్ప్రచారం తిప్పికొట్టేందుకు జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే కార్యక్రమాన్ని చేస్తున్నాం.
► పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తీరు రౌడీ తరహాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.
►నాలుగు సంవత్సరాలు చేసి సంక్షేమ పథకాలు అందించిన ప్రజలకు వివరిస్తూ సమస్యలను తెలుసుకుంటాం.
► కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన అందిస్తున్నారు.

 

విజయవాడ
► ప్రజల గుండెల్లోంచి వచ్చిన కార్యక్రమమే ఈ జగనన్నే మా భవిష్యత్తు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
► 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది.
► ప్రజలకు ఏం చేశామో చెప్పుకోలేని పరిస్థితుల్లో మిగిలిన పార్టీలున్నాయి.
►  ఈ రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేశాడు.
► మేము చేసింది చెప్పడానికే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాం.

పశ్చిమ గోదావరి

►తణుకు పట్టణంలోని 4వ వార్డులో జగనన్నే మాభవిష్యత్, నువ్వే మానమ్మకం జగన్ కార్యక్రమాన్ని మంత్రి కారుమూరి ప్రారంభించారు. గృహసారదులకు వాలంటరీలకు కార్యక్రమం విధి విధానాలను మంత్రి వివరించారు.  పట్టణంలోని 4వ వార్డులో గృహ సారధులతో కలసి పలు ఇళ్లకు తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. చంద్రబాబు ప్రభుత్వానికి సీఎం జగన్ ప్రభుత్వానికి ఉన్న తేడాను ప్రజలకు స్వయంగా తెలియజేశారు.  వైఎస్‌ జగన్ అధికారం చేపట్టాక రూపాయి అవినీతికి తావులేకుండా పథకాలను అందిస్తున్నామని తెలిపారు. 

►నిన్ననే ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం మొదలు పెట్టాం, పేదప్రజలు దగ్గరకు నేరుగా డాక్టరే వెళ్లి వైద్యం చేయటం దేశ చరిత్రలో ప్రప్రథమమని మంత్రి పేర్కొన్నారు. ఏపీ లో జరుగుతున్నఅభివృద్ధిని ఇతర రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కూడ ఆదర్శంగా తీసుకొంటున్నారని పేర్కొన్నారు. ‘చంద్రబాబు.. కరువు కవలపిల్లలు చంద్రబాబు పాదం ఉన్నంతకాలం వర్షాలు పడవు పంటలు పండవు. సీఎం జగన్ రాగానే మేఘాలు కదిలాయి వర్షాలు వర్షించాయి.  జగన్ సీఎం అయ్యాక ప్రకృతి కూడా పరవశించింది. పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. నాడు నేడులో విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు’ అని తెలిపారు.

నంద్యాల జిల్లా:

జగన్ననే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఈరోజు వెలుగోడు మండలలోని మహిళ వెలుగు ఆఫీసు నందు జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని మా నమ్మకం నువ్వే జగనన్న అనే నినాదంతో శ్రీశైల నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి , శ్రీశైల నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి  ప్రారంభించడం జరిగింది..కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో కంటే మన ప్రభుత్వ పాలనలో ఎంతో మందికి ఎన్నో రూపాలుగా మంచి జరగడం మన చూసాం మరియు మన పిల్లల భవిష్యత్తు కోసం మనం మళ్ళీ జగన్ననే ముఖ్యమంత్రి గా చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారు వెలుగోడు పట్టణంలో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమాన్ని ప్రజల ఇంటి వద్దకు వెళ్ళి కార్యక్రమంపై మంచి అపూర్వ స్పందనను స్వీకరించడం జరిగింది ప్రతి ఒక్కరూ జగనన్న పాలనపై అద్భుతమైన సొంతోషాన్ని వ్యక్త పరచడం జరిగింది.జగనన్న ప్రజల కోసం మంచి సంక్షేమాలు ఆయన బాటలు ఆయన కర్తవ్యాలు ప్రతి ఒక్కటి ఆయనను మళ్ళీ ముఖ్యమంత్రి గా కచ్చితంగా గెలిపిస్తాయి మాకు మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రిగా కావాలంటూ ప్రజలు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారితో తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు మహిళలు అభిమానులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది...

►ఆలూరులో మా నమ్మకం మీరే -జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మనూరు జయరాం
►చంద్రబాబు చేసిన మోసాలను,సీఎం జగనన్న చేసిన మంచి గడప గడప తీసుకెళ్తున్నాము.
►రాష్ట్రంలో ప్రతి ఇంటికి నవర్తన సంక్షేమ పథకాలు తీరును ఆడిగితెలుసుకుంటున్నాము.
►గత ప్రభుత్వాలు పాలన ఈ ప్రభుత్వ పాలన గురించి లబ్ధిదారులకు తెలియజేస్తున్నాము....మంత్రి గుమ్మనూరు జయరాం

తిరుపతి జిల్లా:

►తిరుపతి జిల్లా చిల్లకూరులో ఎంపీడీఓ కార్యాలయంలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ ప్రారంభించారు. ప్రతి ఇళ్లు తిరుగుతూ సీఎం జగన్‌ను మరోసారి ఆశీర్వదించాలని కోరుతూ మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్లు అంటించారు.

►వెంకటగిరిలో  జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇంచార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి
►సచివాలయ కన్వీనర్లు, గృహసారధులు వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపు

 ►సూళ్లూరుపేట నియోజకవర్గం లో అట్టహాసంగా ప్రారంభమైన జగనన్నే మా భవిష్యత్..నువ్వే మా నమ్మకం జగన్ కార్యక్రమం
►నాయుడుపేటలోని డిఎస్ఆర్ కళ్యాణ మండపంలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సూళ్లూరుపేట ఎంఎల్ఏ కిలివేటి సంజీవయ్య
►కార్యక్రమంలో పాల్గొన్న  ఆరుమండలాల  వైసీపీ శ్రేణులు, జీసీఎస్‌ కన్వీనర్లు, గృహసారథులు

పశ్చిమగోదావరి జిల్లా:
 తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో జగనన్నే మా భవిష్యత్తు- మా నమ్మకం, నువ్వే జగన్ కార్యక్రమంపై అవగాహన సమావేశం నిర్వహించారు.. జగనన్నే మా భవిష్యత్తు - మా నమ్మకం నువ్వే జగన్ పామ్ ప్లేట్ ను ప్రతి ఇంటికి తీసుకెళ్లబోతున్నామని, ఈ పామ్ ప్లేట్‌లో వాస్తవాలను ప్రచురించడం జరిగిందని మంత్రి కొట్టుసత్య నారాయణ తెలిపారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన హామీలు ఎన్ని అమలు అయ్యాయో, ఎన్ని అవ్వలేదో అనేవి ప్రజల్ని వారి ఇంటి వద్దకే వెళ్లి అడగడం జరుగుతుందన్నారు.

అలాగే తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని నెరవేర్చారో అడుగుతామని చెప్పారు. విద్య, వైద్య, వ్యవసాయ, మహిళా సాధికారత, గృహ నిర్మాణ లను ప్రాధాన్యంగా ఈ ప్రభుత్వం తీసుకుందన్నారు. ఇచ్చిన హామీలతో పాటు, ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారని గుర్తు చశారు. వెన్నుపోటు దారుడు చంద్రబాబు. అటువంటి వ్యక్తిని అసలు నమ్మే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. 

►జగనన్న మా భవిష్యత్తు,మా నమ్మకం నువ్వే జగనన్న  కార్యక్రమం పోస్టర్ ను పెద ఆమీరం పార్టీ కార్యాలయంలో విడుదల చేసిన డిసిసిబి చైర్మన్ పి వి ఎల్ నరసింహరాజు

పశ్చిమగోదావరి జిల్లా:

►భీమవరం ఒకటో వార్డు మెంటే వారి తోటలో జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
►మెంటే వారి తోటలో ఇంటింటికి తిరుగుతూ డోర్ పోస్టర్లు అతికిస్తూ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు వివరిస్తున్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

►పాల్గొన్న  పార్టీ రాష్ట్ర కార్యదర్శి  ఏఎస్ రాజు, ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహారాజు, గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు, వైయస్సార్ సిపి నాయకులు ,కార్యకర్తలు

ఎన్టీఆర్ జిల్లా: 
►మైలవరం లో జగనన్నే మా భవిష్యత్తు మానమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, నియోజకవర్గ పరిశీలకుడు పడమటి సురేష్ బాబు.

నెల్లూరు జిల్లా:
 ►కావలి 10వ వార్డులో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి
►ఇంటింటికి వెళ్లి. అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజా అభిప్రాయ సేకరణ  కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి

ఎన్టీఆర్ జిల్లా :
►తిరువూరు నియోజకవర్గ స్థాయిలో విసన్నపేటలోని నాలుగో వార్డ్ లో "జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని గృహ సారధులతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి

ప.గో:జిల్లా:
►పాలకొల్లు మావుళ్ళమ్మ పేట లో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ కవురు  శ్రీనివాస్

►పాల్గొన్న  ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లె0 ఆనంద ప్రకాష్, జెడ్పీటీసీ గోవిందరాజుల నాయుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ

ఏలూరు జిల్లా:

►కైకలూరు నియోజకవర్గంలో జగనన్నే మా భవిష్యత్తు- మా నమ్మకం నువ్వే జగన్, కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ప్రారంభించారు.

ఎమ్మెల్యే ఎలిజా కామెంట్స్
►జగనన్న నువ్వే మా భవిష్యత్. కార్యక్రమం ఈరోజు నుంచి 20 తారీకు వరకు జరగుతుంది 
►ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేసి, గత తెలుగుదేశం ప్రభుత్వం లో జరిగిన అవినీతి అక్రమాలను ప్రజలకు తెలియజేస్తాం.

కృష్ణా జిల్లా :
►ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి

శ్రీకాకుళం
►శ్రీకాకుళంలోని సిపన్ నాయుడుపేటలోని జగనన్న నువ్వే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా పోస్టల్ ఇంటికంటే అంటిస్తున్న ధర్మాన రామ్ మనోహర్ నాయుడు

కుల‌మ‌తాల‌కు అతీతంగా సంక్షేమ ప‌థ‌కాలు - యువ నాయ‌కులు ధ‌ర్మాన రామ్ మ‌నోహ‌ర్ నాయుడు

మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్ అనే కార్య‌క్ర‌మాన్ని సీప‌న్నాయుడు పేట‌లో యువ నాయ‌కులు ధ‌ర్మాన రామ్ మ‌నోహ‌ర్ నాయుడు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. సీపాన రామారావు ఆధ్వ‌ర్యంలో ఇక్క‌డున్న వ‌లంటీర్లు, గృహ సార‌థులు, సచివాల‌య క‌న్వీన‌ర్ల‌తో ఇంటింటికీ వెళ్లాం. నాలుగేళ్ల కాలంలో కుల‌,మ‌తాల‌కు అతీతంగా సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు చేస్తున్నాం. ఇవాళ ప్ర‌జ‌లంతా ఈ నాలుగేళ్ల కాలంలో ఆనందంగా ఉన్నారు. శ్రీ‌కాకుళం నియోజ‌క‌వ‌ర్గంలో ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి అన్న‌వి ఏక కాలంలో చేయ‌గ‌లుగుతున్నారు. రోడ్డు వేస్తేనే అభివృద్ధి కాదు. రోడ్లూ వేయాలి, సంక్షేమ‌మూ చేయాలి. నాడు - నేడు పేరిట నిర్వ‌హిస్తున్న స్కూల్స్ ను చూడండి ఏవిధంగా అభివృద్ధి చెందాయో అన్న‌ది మీకు తెలుస్తుంది. అలానే చిన్నారుల‌కు ఆధునిక సాంకేతిక‌త‌తో కూడిన విద్య, విలువ‌ల‌తో కూడిన విద్య‌ను అందిస్తూ ఉన్నామ‌ని, అదేవిధంగా మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం అమ‌లులో భాగంగా పోష‌కాహారం అందిస్తున్నామ‌ని, అలానే ధ‌న‌వంతుల పిల్ల‌ల‌తో స‌మానంగా పేద బిడ్డ‌లు చ‌దువుకునేందుకు వీలుంగా సౌక‌ర్యాలు క‌ల్పించాం. వారికి బుక్స్, షూ, యూనిఫాం అందించాం. ఓ వైపు టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు, మ‌రోవైపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌మ్మ‌ల్ని నిలువ‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ మేం న‌మ్ముకున్న‌ది ప్ర‌జ‌ల‌ను. వారికి అందిస్తున్న ప‌థ‌కాల స‌ర‌ళిని. మ‌ధ్య‌వ‌ర్తుల ప్ర‌మేయం అన్న‌ది లేకుండా అందిస్తున్న సంక్షేమ ప‌థ‌కాల స‌ర‌ళిని. అదేవిధంగా ఇవాళ మేం చేస్తున్న అభివృద్ధి అన్న‌ది పాఠ‌శాల‌లో ఏ విధంగా ఉన్న‌ది అన్న‌ది అంద‌రికీ తెలుసు. ఇది కాదా మార్పు అని నేను అడుగుతున్నాను. ఇవాళ మేం ధైర్యంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్ల‌గ‌లుగుతున్నాం అంటే అందుకు కార‌ణంగా నిష్ప‌క్ష‌పాతంగా ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డ‌మే. అలానే పార్టీల‌కు అతీతంగా ఇవాళ ప‌థ‌కాల వ‌ర్తింపు అన్న‌ది చేస్తున్నాం. క‌నుక విమ‌ర్శ‌లు మానుకోండి. అభివృద్ధికీ, సంక్షేమానికీ సహ‌క‌రించండి. ఒక‌వేళ మేం త‌ప్పులు చేస్తే మా దృష్టికి తీసుకు రండి. త‌ప్ప‌క దిద్దుకుంటాం. స‌ల‌హాలు ఇవ్వండి. మంచి స‌ల‌హాలు ఇవ్వండి. అంతేకానీ పొద్దున అయితే చాలు జ‌గ‌న్ ను ప్ర‌జ‌ల నుంచి ఏ విధంగా దూరం చేయాలి. ధ‌ర్మాన‌ను ప్ర‌జ‌ల నుంచి ఏ విధంగా దూరం చేయాలి అన్న‌వి మానుకోవాలి. ఈ ప్ర‌భుత్వం ధ‌నికుల కోసం కాదు పేద ప్ర‌జ‌ల కోసం ప‌నిచేస్తుంది. రెక్కాడితే కానీ డొక్కాడ‌ని వారి కోసం ప‌ని చేస్తున్నాం. మ‌హిళ‌ల కోసం ప‌నిచేస్తున్నాం. అవ్వా తాత‌ల కోసం ప‌నిచేస్తున్నాం. నెల రోజుల ముందు గడ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం అనే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాం. అద్భుతంగా ఆ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి, ల‌బ్ధిదారుల‌ను క‌ల‌వగ‌లిగాం. ద‌య‌చేసి మేలు చేసే ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా నిల‌వండి. ప్ర‌జాశీర్వాదంతోనే మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్ అనే కార్య‌క్రమం చేప‌డుతున్నాం. ఇది కూడా విజ‌య‌వంతం అవుతుంద‌ని విశ్వ‌సిస్తున్నాం. అదేవిధంగా నాతో న‌డిచిన కార్య‌క‌ర్త‌ల‌కూ, వైసీపీ నాయ‌కుల‌కూ, స్థానిక పెద్ద‌లు పైడి రాజారావుకూ కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సాధు వైకుంఠ రావు, ఎంపీపీలు గోండు రఘురామ్, అంబటి నిర్మల శ్రీనివాస్ రావు, సీపాన రామారావు, మెంటాడ స్వరూప్, అందవరపు సంతోష్, పైడి రాజారావు, తెలుగు రమేష్, ఉట్ల శ్రీను, తేజ, ఉటపళ్లి కృష్ణ, బరాటం సంతోష్,మార్పు పృథ్వి, అప్పూయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

 

 డిప్యూటీ సీఎం అంజద్ బాషా కామెంట్స్..

►జగనన్న నీవే మా భవిష్యత్ ఆన్న నినాదంతో కొత్త కార్యక్రమం చేపట్టాం
►అధికారంలో ఉండగా తమ ప్రభుత్వ పనితీరును ధైర్యంగా చెప్పి, వారికి అవగాహన కల్పించే సాహసోపేత నిర్ణయం
►కోటి 60 లక్షల కుటుంబాలను నేరుగా కలిసేందుకే ఈ జగనన్నే మా భవిషత్ కార్యక్రమం
►ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు ఇవేమీ అందుతున్నాయి.. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను గుర్తించేలా వైసిపి సైనికులు పనిచేస్తారు..

►వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సైనికులు, గృహ సారథులు, కన్వీనర్లు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను వివరిస్తారు
►పథకాల వివరాలతో కరపత్రం, స్టిక్కర్ అందిస్తారు.
►సంతృప్తి చెందితేనే నన్ను ఆశీర్వదించండి అని చెప్పిన ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్.

కాకినాడ జిల్లా
►పిఠాపురం: చిత్రాడ గ్రామంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పెండెం దొరబాబు..

►ప్రతి పేదవాడికి క్షేమ పథకాలు గత టిడిపి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లబ్ధిని గుర్తించాలని ప్రజలను కోరిన.. ఎమ్మెల్యే దొరబాబు

►ప్రజల గురించి నిరంతరం ఆలోచించే నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పెండెం దొరబాబు

వైఎస్సార్ జిల్లా
►ప్రొద్దుటూరు మునిసిపాలిటీ లో  జగనన్నే మా భవిష్యత్, మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో  పాల్గొన్న ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి
►నేటి నుండి జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం రానున్న ఎన్నికల వరకు కొనసాగుతుంది
►గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పతకాలు ఎంతవరకు అందాయని వివరించనున్న ఎమ్మెల్యే రాచమల్లు
►600 కోట్ల తో ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల ను వివరించనున్న ఎమ్మెల్యే రాచమల్లు
►పార్టీలకు అతీతంగా పేదరికం నే ప్రామాణికముగా ప్రభుత్వ సంక్షేమ పతకాలు అందించిన  ముఖ్యమంత్రి
►ఈ కార్యక్రమంలో పాల్గొన్న మునిసిపల్ చైర్మన్ లక్ష్మీదేవి, ఆప్కోబ్ చైర్మన్ జాన్సీ,పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ విజయ లక్ష్మి, కౌన్సిలర్లు, వైఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు

చిత్తూరు
►పుంగనూరు మండలం భగత్ సింగ్ నగర్ కాలనీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన
►ఇంటింటికి వెళ్లి జగనన్న నువ్వే మా భవిష్యత్తు కార్యక్రమం
►నివాస గృహాలకు స్టిక్కర్లు అతికించిన మంత్రి పెద్దిరెడ్డితో పాటు పార్టీ నేతలు
►ప్రజా ప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లాలి
►టిడిపి వైఎస్ఆర్సిపి పాలనకు ఉన్న వ్యత్యాసం వివరించాలి
►సీఎం జగన్ చేసిన మేలును వివరించాలి

 ►కార్వేటి నగర్ మండలంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పర్యటన
►జగనన్న నువ్వే మా భవిష్యత్తు కార్యక్రమం
►అన్నమయ్య జిల్లా పీలేరు నియోజవర్గం వాల్మీకిపురం మండలంలో జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ పాల్గొన్న ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
 

►విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జగనన్నే.. మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్.. కార్యక్రమం ప్రారంభం

►కార్యక్రమంలో పాల్గొన్న  వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్, వైసీపీ నేత కడియాల బుచ్చిబాబు

తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్ మాట్లాడుతూ..

►ప్రజలవద్దకు వెళ్లే దమ్ము, ధైర్యం వైసీపీకే ఉన్నాయి

►ప్రతీ ఇంటికి వెళ్లి టీడీపీ చేసిన మోసం, వైసీపీ చేసిన సంక్షేమాభివృద్ధి మేము చెప్తున్నాం

►రాష్ట్రంలో ఏ ఇంటికి సీఎం జగన్ సైన్యం వెళ్లినా ఆశీర్వదించి పంపుతున్నారు

►సీఎం జగన్ పాలనలో సుభిక్షంగా ఉన్నామని చెప్తున్నారు

►లోకేశ్ పాదయాత్రలో విద్యార్థులను మధ్యాహ్న భోజనం బావుందా అని అడిగితే చాలబావుందని చెప్పారు

►విద్యార్థుల సమాధానం విని లోకేష్ మైండ్ బ్లాంక్ అయ్యింది

►రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉంది

►175నియోజకవర్గాల్లో సీఎం జగన్ నిలబెట్టిన అభ్యర్థులు గెలుస్తారు

►తూర్పు నియోజకవర్గంలో వైసీపీ నూటికి నూరుశాతం గెలుస్తుంది

►విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 63వ డివిజన్ కొత్త రాజీవ్ నగర్ లో జగనన్నే మా భవిష్యత్తు- మా నమ్మకం నువ్వే జగన్" కార్యక్రమం ప్రారంభం 

►పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సెంట్రల్ నియోజకవర్గం పరిశీలకులు కడవకొల్లు నరసింహారావు, గృహసారథులు, కన్వీనర్లు ,వాలంటీర్లు

 

►ఏపీ వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నేటి నుంచి ప్రారంభమయ్యే ‘జగనన్నే మా భవిష్యత్‌’ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ వరకూ కొనసాగనుంది. సచివాలయానికి ముగ్గురు చొప్పున నియమించిన కన్వినర్లు, ప్రతి 50 నుంచి వంద ఇళ్లకు ఇద్దరు చొప్పున నియమించిన గృహ సారథులతో కూడిన ఏడు లక్షల మంది సైన్యం ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది.

►దీనికి సంబంధించి వారికి ప్రత్యేకమైన కిట్‌ బ్యాగ్‌లు అందచేశారు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఆయా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తారు. 14 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా 15,004 సచివాలయాల పరిధిలో 1.60 కోట్ల కుటుంబాలలోని ఐదు కోట్ల మంది ప్రజలను కలుసుకోనున్నారు.

ప్రజా మద్దతు పుస్తకంలో ప్రశ్నలివీ.. 

► ఇంతకు ముందు పాలనతో పోల్చుకుంటే జగనన్న పరిపాలనలో మీకు, మీ కుటుంబానికి మంచి జరిగిందా? 
►మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలనలో ఎక్కువ మంచి జరిగిందా? 
►.గత ప్రభుత్వంలో కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పింఛన్, అమ్మ ఒడి, ఆసరా, చేయూత లాంటి అనేక పథకాల ద్వారా డబ్బులను నేరుగా మీ అకౌంట్‌లో వేయడం లేదా వలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుందా? 
► నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా? 
►జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతిస్తారా?   

కిట్‌ బ్యాగ్‌లో ఏముంటాయంటే.. 
♦ ఒక్కో కిట్‌ బ్యాగ్‌లో 200 ఇళ్లకు సరిపడా సామగ్రి ఉంటుంది.  
♦టీడీపీ సర్కార్‌కు, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను వివరిస్తూ రూపొందించిన 200 కరపత్రాలు 
♦ ప్రజా మద్దతు పుస్తకాలు టమూడు పెన్నులు 
♦  ఇద్దరు గృహ సారథులు, ముగ్గురు కన్వినర్లు ధరించేందుకు సీఎం జగన్‌ ఫొటోతో కూడిన ఐదు బ్యాడ్జీలు 
♦సీఎం వైఎస్‌ జగన్‌ ఫొటో ఉన్న 200 స్టిక్కర్లు  
♦ సీఎం జగన్‌ ఫోటో ఉన్న 200 మొబైల్‌ ఫోన్‌ స్టిక్కర్లు  
 
కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారంటే.. 
♦ ప్రతి ఇంటి వద్దకు ఇద్దరు గృహ సారథులు, వలంటీరు వెళతారు. టీడీపీ సర్కార్‌కు,  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను ఆ కుటుంబ సభ్యులకు వివరిస్తూ రూపొందించిన కరపత్రాన్ని చదివి వినిపిస్తారు. తర్వాత కరపత్రాన్ని వారికి అందజేస్తారు.  
♦ప్రజా మద్దతు పుస్తకంలో ప్రజా సర్వేకు సంబంధించి ఐదు ప్రశ్నలు ఉన్న స్లిప్పుపై  కుటుంబ పెద్ద పేరు, ఫోన్‌ నంబర్‌ నమోదు చేస్తారు. ఆ తర్వాత ఐదు ప్రశ్నలను చదివి  ఆయా కుటుంబాలు ఇచ్చే సమాధానాల ఆధారంగా అవును / కాదు అనే వివరాలను నమోదు చేస్తారు. స్లిప్పు కుడి వైపున ఉన్న రసీదును ఆ కుటుంబానికి ఇస్తారు. 
♦వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారిని 82960–­82960 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలని కోరతారు. మిస్డ్‌ కాల్‌ ఇచ్చిన నిముషంలోపే కృతజ్ఞతలు తెలియచేస్తూ సీఎం జగన్‌ సందేశంతో ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ ఆ కుటుంబానికి వస్తుంది. 
♦ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారి ఇంటి తలుపునకు సీఎం వైఎస్‌ జగన్‌ ఫొటోతో కూడిన స్టిక్కర్‌ అతికించేందుకు అనుమతి కోరతారు. సమ్మతించిన వారి ఇంటి తలుపునకు స్టిక్కర్‌ అతికిస్తారు. అదే రీతిలో మొబైల్‌ ఫోన్‌కు స్టిక్కర్‌ అతికించి  ధన్యవాదాలు తెలియచేస్తారు. 
♦ ఈ కార్యక్రమం పూర్తయ్యాక ప్రజల అభిప్రాయాన్ని సేకరించిన ప్రజా మద్దతు పుస్తకాన్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపుతారు.

Back to Top