ఘ‌నంగా ప్రారంభ‌మైన ‘జగనన్నే మా భవిష్యత్తు’  

జ‌నంలోకి ఏడు లక్షల మంది వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం 

వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వ సంక్షేమ‌ పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్న గృహ సారథులు, కన్వీనర్లు

జ‌గ‌న‌న్నే మా భ‌విష్య‌త్తు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు

ప్ర‌జారంజ‌క పాల‌న‌ను వివ‌రిస్తూ ఇంటింటికీ `మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్` స్టిక్ల‌ర్లు

గ‌త టీడీపీ సర్కార్‌కు, వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభుత్వానికి మధ్య తేడాను వివరిస్తూ ముందుకు..

తాడేప‌ల్లి: పేదరిక నిర్మూల‌నే ధ్యేయంగా ఆంధ్ర‌రాష్ట్రంలో ఆద‌ర్శ‌వంత‌మైన పాల‌న సాగుతోంది. అర్హ‌త ఒక్క‌టే ప్రామాణికంగా ప్ర‌తి సంక్షేమం ల‌బ్ధిదారుల గ‌డ‌ప వ‌ద్ద‌కే చేరుతోంది. ఎన్నిక‌ల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 46 నెలల్లో 98.5 శాతం ఎన్నికల హామీలను అమలు చేసి మేనిఫెస్టోకు సిసలైన నిర్వచనం ఇచ్చారు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌. అధికారమ‌న్న‌ది ప్ర‌జల‌కు సేవ‌చేయ‌డానికేన‌ని చాటిచెప్పారు. ఆదర్శ పాలనతో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచారు. అర్హ‌త ఒక్క‌టే ప్రామాణికంగా, పేదరిక నిర్మూల‌నే ధ్యేయంగా ఆంధ్ర‌రాష్ట్రంలో ప్ర‌జారంజ‌క ప‌రిపాల‌న సాగుతోంది. గ‌త టీడీపీ సర్కార్‌కు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని వివరిస్తూ మరోసారి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతూ ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం నేడు రాష్ట్ర వ్యాప్తంగా అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. 

రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో గ్రామ‌, వార్డు సచివాలయాల‌కు ముగ్గురు చొప్పున నియమించిన కన్వీనర్లు, గృహ సారథులతో కూడిన ఏడు లక్షల మంది సైన్యం జ‌గ‌న‌న్నే మా భ‌విష్య‌త్తు కార్యక్రమంలో పాల్గొని ప్ర‌తి త‌లుపునూ త‌డుతూ, ప్ర‌తి గ‌డ‌ప‌నూ తొక్కుతూ వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేస్తున్న మంచిని వివ‌రిస్తున్నారు. ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ‌ సమన్వయకర్తలు సైతం పాల్గొని ప్ర‌భుత్వం ప్ర‌తి ఇంటికి చేస్తున్న మేలును వివ‌రిస్తున్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ సైనికులు, గృహ సారథులు, కన్వీనర్లు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను వివరిస్తున్నారు. పథకాల వివరాలతో కరపత్రం, స్టిక్కర్ అందిస్తున్నారు. నేటి నుంచి 14 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా 15,004 సచివాలయాల పరిధిలో 1.60 కోట్ల కుటుంబాలలోని ఐదు కోట్ల మంది ప్రజలను కలుసుకోనున్నారు. సుమారు 18 నెలల పాటు పట్టి పీడించిన కరోనాతో ప్రపంచమంతా ఆర్థి క సంక్షోభంతో తల్లడిల్లినా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏ ఒక్క సంక్షేమ పథకాన్నీ ఆపలేదు. 46 నెలల్లో సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో రూ.రెండు లక్షల కోట్లను జమ చేయడం దేశ చరిత్రలో రికార్డు. 

► విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారు. 
► సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకెళ్లారు. 
► పరిపాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షల మేరకు 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్‌ వ్యవస్థీకరించి పరిపాలనను వికేంద్రీకరించారు. 
► సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ఆర్థి క చేయూతతో పేదరిక నిర్మూలనతోపాటు రాజ్యాధికారంలో సింహభాగం వాటా ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయం చేకూర్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు సామాజిక సాధికారత సాధించేలా బాటలు వేశారు. 
► తాము పెట్టుకున్న నమ్మకం కంటే రెండింతలు అధికంగా న్యాయం చేస్తూ పరిపాలిస్తుండటంతో ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అంటూ ప్రజలు నినదిస్తున్నారు. ప్రజల్లో నుంచి వ చ్చిన ఈ నినాదాన్నే ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేర్చింది.  

ప్రజా మద్దతు పుస్తకంలో.. 
► ఇంతకు ముందు పాలనతో పోల్చుకుంటే జగనన్న పరిపాలనలో మీకు, మీ కుటుంబానికి మంచి జరిగిందా? 
►మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలనలో ఎక్కువ మంచి జరిగిందా? 
►గత ప్రభుత్వంలో కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పింఛన్, అమ్మ ఒడి, ఆసరా, చేయూత లాంటి అనేక పథకాల ద్వారా డబ్బులను నేరుగా మీ అకౌంట్‌లో వేయడం లేదా వలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుందా? 
► నేడు మన జగనన్న పాలనలో అమలు చేస్తున్న అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా? 
►జగనన్న పాలనలో అమలవుతున్న ఈ సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగించడానికి మీరు జగనన్నపై నమ్మకం ఉంచి మద్దతిస్తారా?   

కిట్‌ బ్యాగ్‌లో.. 
► ఒక్కో కిట్‌ బ్యాగ్‌లో 200 ఇళ్లకు సరిపడా సామగ్రి ఉంటుంది.  
► టీడీపీ సర్కార్‌కు, వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను వివరిస్తూ రూపొందించిన 200 కరపత్రాలు 
► ప్రజా మద్దతు పుస్తకాలు టమూడు పెన్నులు 
► ఇద్దరు గృహ సారథులు, ముగ్గురు కన్వినర్లు ధరించేందుకు సీఎం వైయ‌స్‌ జగన్‌ ఫొటోతో కూడిన ఐదు బ్యాడ్జీలు 
► సీఎం వైయ‌స్‌ జగన్‌ ఫొటో ఉన్న 200 స్టిక్కర్లు  
► సీఎం వైయ‌స్‌ జగన్‌ ఫోటో ఉన్న 200 మొబైల్‌ ఫోన్‌ స్టిక్కర్లు  

Back to Top