విజయవాడ: జగనన్నే మా భవిష్యత్ అనే కార్యక్రమ పోస్టర్‌ను మంగళవారం వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకులు ఆవిష్కరించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, యేసురత్నం, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం వైయస్ జగన్ పాలన సాగుతుందన్నారు. ఏప్రిల్ 7వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. 14 రోజుల పాటు జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరును ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వానికి..ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను వివరిస్తామన్నారు. ప్రజలకు రాజకీయ పార్టీలు జవాబుదారీగా ఉండాలని, ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలన్నదే మా ఆశయం అన్నారు. మా నమ్మకం నువ్వే జగనన్న అనే భావన ప్రజల నుంచి వచ్చిందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేయడమే మా లక్ష్యమన్నారు.