ఆరోగ్యంధ్రప్రదేశ్ కోసమే జగనన్న ఆరోగ్యసురక్ష కార్యక్రమం

వైయ‌స్ఆర్‌సీపీ డాక్ట‌ర్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు డాక్ట‌ర్ బ‌త్తుల అశోక్ రెడ్డి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్‌, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ స్పెషల్ ఆఫీసర్ యాదాల అశోక్ బాబు

పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆరోగ్య సుర‌క్ష కార్య‌క్ర‌మం పోస్ట‌ర్ విడుద‌ల‌

తాడేప‌ల్లి: ఆరోగ్యంధ్రప్రదేశ్ కోసమే జగనన్న ఆరోగ్యసురక్ష కార్యక్రమాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్లు వైయ‌స్ఆర్‌సీపీ డాక్ట‌ర్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు డాక్ట‌ర్ బ‌త్తుల అశోక్ రెడ్డి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్‌,  వైయ‌స్ఆర్ ఆరోగ్య‌శ్రీ‌ హెల్త్ కేర్ ట్రస్ట్ స్పెషల్ ఆఫీసర్ యాదాల అశోక్ బాబు అన్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష పోస్ట‌ర్‌ను వారు విడుద‌ల చేశారు. అనంత‌రం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామకృష్ణారెడ్డిని స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో వారు మాట్లాడుతూ..  రాష్ట్రంలో ప్రతి పేదవాడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే గొప్ప ఆశయంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సీఎం  వైయస్ జగన్ తీసుకువచ్చారని  తెలిపారు. ఈ నెల 15 వతేదీ నుంచి 30 వతేదీ వరకు  అన్ని గ్రామ,వార్డు సచివాలయాల పరిధిలో వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఆయా గృహాలలో ఆరోగ్యసేవలు గురించి ఆరాతీసి అవి అవసరమైన వారిని గుర్తిస్తారు. ఆ తర్వాత అక్టోబర్ 1 వ తేదీనుంచి 30 వతేదీ వరకు రాష్ట్రంలోని అన్ని స‌చివాల‌యాల‌ పరిధిలో ప్రతి రోజూ 700 మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందన్నారు. వారికి 14 రకాల వైద్యసేవలు అందిస్తామని, 105 రకాల మందులను ఉచితంగా అందిస్తామని వివరించారు. 

30 రోజుల పాటు విలేజ్ క్లినిక్ లలో జరిగే మెడికల్ క్యాంప్ లలో మెరుగైన వైద్యసేవలు అసరమైనవారిని గుర్తించి వారికి ఆరోగ్యశ్రీ రిఫరల్ ఆస్పత్రులలో వైద్యసేవలు అందిస్తామని అన్నారు. ముఖ్యంగా మెడికల్ క్యాంపులలో ఇద్దరు ప్రభుత్వ వైద్యులు,ఒక ప్రైవేటు వైద్యడు,వైయస్సార్ సిపి డాక్టర్ సెల్ నుంచి మరో వైద్యుడు సేవలందిస్తారని వివరించారు.గతంలో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పేదవాడికి కార్పోరేట్ వైద్యాన్ని అందించిన ఘనత  వైయస్ రాజశేఖరరెడ్డిదని నేడు  వైయస్ జగన్ తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తున్నారని అన్నారు.  ఆరోగ్యశ్రీ సేవలతో స్వర్గీయ వైయస్సార్ ప్రతి పేదవాడి గుండెలలో  నిలిచిపోయారన్నారు. వైయస్ జగన్ మరో రెండు అడుగులు ముందుకు వేసి విలేజ్ క్లినిక్ లు,ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ లతో తండ్రి ని మించిన తనయుడుగా పేరుతెచ్చుకున్నారని అన్నారు.ముఖ్యంగా కోవిడ్ వంటి సంక్షోభాన్ని ఎదుర్కొని దేశంలోనే అత్య్తుతమ సేవలు అందించేలా ఏపిని నిలిపారన్నారు. స‌మావేశంలో డాక్టర్ సెల్ జోన్ 4 అధ్యక్షుడు మహబూబ్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top