డేటా చోరీపై అసెంబ్లీలో మధ్యంతర నివేదిక

అమరావతి:  టీడీపీ హయాంలో జరిగిన డేటా చోరీపై అసెంబ్లీలో మధ్యంతర నివేదికను హౌస్‌ కమిటీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ప్రవేశపెట్టారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరగాలని భూమన కోరారు. టీడీపీ సేవా మిత్ర యాప్‌ను దుర్వినియోగం చేసిందని చెప్పారు. సేవా మిత్ర యాప్‌ ద్వారా 30 లక్షల ఓట్లు తొలగించే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వంలో డేటా చోరీ జరిగింది..డేటా చోరీ జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. డేటా దొంగలను పట్టుకునేందుకు విచారణ చేస్తున్నామని తెలిపారు.

వ్యక్తుల ప్రైవేట్ సమాచారాన్ని దుర్వినియోగం చేశారని భూమన కరుణాకర్ రెడ్డి సభలో చెప్పారు. నాలుగుసార్లు చర్చించాం. వివిధ శాఖల అధిపతుల్లో చర్చించాం. సంబంధిత అధికారులతో భేటీ అయ్యాం. 25-3-22న సభ హౌస్ కమిటీ వేసింది. తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేకమయిన లబ్ధి జరగడానికి అవకాశం వచ్చింది. యాప్ ని దుర్వినియోగం చేసి ప్రభుత్వం నుంచి సమాచారాన్ని తీసుకుని తమకు ఓటెయ్యని వారిని తొలగించే ప్రయత్నం జరిగింది. ఈ డేటా చౌర్యానికి సంబంధించి మరింత మందిని విచారించాలి. మధ్యంతర నివేదికను సభ ముందుకి తెచ్చాం. చౌర్యం చేసిన వారిని పట్టుకోవాలి. నూటికి నూరుశాతం చౌర్యం చేశారని సభా సంఘం నిర్దారించిందని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top