కాసేపట్లో వైద్య, ఆరోగ్యశాఖపై మేధోమథన సమీక్ష

తాడేపల్లి: ‘మన పాలన – మీ సూచన’ కార్య‌క్ర‌మంలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నేడు వైద్య, ఆరోగ్య శాఖపై మేధోమథన సమీక్ష కాసేపట్లో ప్రారంభం కానుంది. ఆరోగ్యశ్రీ కార్యక్రమంపై కీలకంగా చర్చ జరగనుంది. ఆస్పత్రుల్లో నాడు–నేడు కార్యక్రమంపై, 104, 108ల ఆధునీకరణ, వాహనాల సంఖ్య పెంపుపై, గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటు, కంటివెలుగు ద్వారా అందరికి కంటి పరీక్షలు, శస్త్ర చికిత్సలపై సమీక్షించనున్నారు. అదే విధంగా ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి మెడికల్‌ కాలేజీ ఉండేలా చర్యలు, వైద్యులు, మెడికల్‌ సిబ్బంది ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. వైద్య, ఆరోగ్యశాఖలో పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చర్చించనున్నారు. 

Back to Top