సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌ర్ధ‌తే నిదర్శనం..!

రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత

విజ‌య‌వాడ‌:  దేశ వ్యాప్తంగా సాగుతున్న స్మగ్లింగ్‌లో మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండటం వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమ‌ని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జగ‌న్ సమర్థతే దీనికి కారణమని, పోలీసు యంత్రాంగం మెరుగైన పనితీరు ఇందుకు నిదర్శనమంటూ కొనియాడారు. గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్, మత్తు పదార్థాలు రవాణాను ఆరికట్టడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి రవాణాశాఖ ఆరికట్టడానికి మా సర్కార్‌ ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు.. గంజాయి సాగే జీవనాధరంగా జీవిస్తున్న గిరిజనల్లో అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు..
 

తాజా వీడియోలు

Back to Top