అగ్రి గోల్డ్‌ బాధితులకు జగనన్న భరోసా 

 మేకతోటి సుచరిత, హోంమంత్రి 

తాడేప‌ల్లి:  అగ్రిగోల్డ్ బాధితుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భ‌రోసా క‌ల్పించార‌ని హోమ్ మంత్రి మేక‌తోటి సుచ‌రిత పేర్కొన్నారు. భారతదేశంలో ఎప్పుడూ కూడా లేని విధంగా ఆర్ధిక నేరాలకు లోనైన ప్రజలకు ప్రభుత్వం సహాయం చేయడం అన్నది ఒక చరిత్ర, అది మీ హయాంలోనే సాధ్యమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. శ్రమజీవులు రూపాయి రూపాయి కూడబెట్టుకుని దానిని దాచుకుని కోల్పోయిన వారు తిరిగి ఆ డబ్బు వస్తుందన్న ఆశలేని వారు దాదాపు 300 మంది ఏజెంట్లు ఒత్తిడి తట్టుకోలేక చనిపోయిన పరిస్ధితులు ఉన్నాయి. గత ప్రభుత్వం న్యాయం చేస్తుందనుకున్న ప్రజలకు అగ్రి గోల్డ్‌ ఆస్తులపై కన్నేసిన పెద్దలు ఏ విధంగా వ్యవహరించారు అంటే...హాయ్‌ల్యాండ్‌ కూడా అగ్రి గోల్డ్‌ వారు మాది కాదని కోర్టులో చెప్పించారు. మీరు అగ్రి గోల్డ్‌ బాధితుల కష్టాలు తెలుసుకున్న తర్వాత దీనిపై ఒక కమిటీ ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున పోరాటం చేయడంతో పాటు, మ్యానిఫెస్టోలో 13 వ అంశంగా చేర్చి బాధితులకు అండగా నిలవడం సంతోషకరం. బాధితులకు తమ డబ్బు తిరిగి వస్తుందని ఆశలు లేని సమయంలో మీరు 2019లోనే చెల్లింపులు చేయడం, ఇప్పుడు మరోసారి చెల్లింపులు చేయడం సంతోషకరం. ఈ రెండు విడతలలో 10.40 లక్షల మందికి రూ. 905.57 కోట్లు మనం చెల్లించడం మీ చిత్తశుద్దిని తెలియజేస్తుంది. అగ్రి గోల్డ్‌ బాధితులు చాలా రాష్ట్రాలలో ఉన్నా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు. డిపాజిటర్లు అందరూ కూడా మీ వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు, కోర్టులో తేలిన తర్వాత వారికి కూడా మీ ద్వారా న్యాయం జరుగుతుందని వారు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని మన రాష్ట్రానికి అందించినటువంటి మీరు ఎప్పుడూ చల్లగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. 

 చరిత్రాత్మక దినం:  పీవీ.సునీల్‌ కుమార్, సీఐడీ అడిషనల్‌ డీజీ 

సార్‌ ఈ రోజు చరిత్రాత్మక దినం, గత ఏడు సంవత్సరాలుగా ఏడు లక్షల మంది డిపాజిటర్లు తమకు ఎప్పుడు రిలీఫ్‌ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు, వారికి తమ చేతుల మీదుగా రూ. 666.84 కోట్లు ఇవ్వడం ఒక చరిత్రాత్మక ఘట్టం, ఇంతవరకూ మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఒక ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్ధలో డబ్బు జమ చేసి మోసపోయిన వారికి ప్రభుత్వమే బాధ్యత తీసుకుని రిలీఫ్‌ ఇవ్వడం అనేది ఇది మొట్టమొదటిసారి జరుగుతుంది, రెండోది ఒక పోలీస్‌ అధికారిగా మాకు ఇటువంటి ప్రజలకు రిలీఫ్‌ ఇచ్చే కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం లైఫ్‌టైమ్‌లో ఇది మొట్టమొదటి అనుభవం సార్, ధ్యాంక్యూ వెరీమచ్‌ సార్‌. అగ్రి గోల్డ్‌ కు సంబంధించి 1995లో స్ధాపించారు, 2014లో ఈ సంస్ధ డిపాజిట్‌దారులకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వడంలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో కేసులు నమోదు చేయడం జరిగింది. 2017లో డిపాజిటర్ల ఎన్యూమరేషన్‌ ప్రక్రియ జరిగింది, కానీ తమరు వచ్చిన తర్వాతే మీరు ఇచ్చిన భరోసాతోనే 2019 లో రూ. 10 వేల లోపు డిపాజిట్‌ చేసిన డిపాజిట్‌దారులకు మొదటి విడత రిలీఫ్‌ ఇవ్వడం జరిగింది. అగ్రి గోల్డ్‌ కేసులన్నీ కూడా గౌరవ హైకోర్టు తెలంగాణ పరిధిలో ఉన్నాయి. వారి సూచనల మేరకు మొదటి విడతలో రూ. 10 వేల లోపు డిపాజిట్‌ చేసిన వారికి డిఎల్‌ఎస్‌ఏ ద్వారా తీసుకుని వారు ఎన్యూమరేట్‌ చేసి ఫైనల్‌ చేసిన లిస్ట్‌ మేరకే ఇవ్వమని కోర్టు చెప్పింది. అయితే కేవలం 13 మంది డీఎల్‌ఎస్‌ఏలు ఉండడం, లబ్దిదారులు లక్షల్లో ఉండడం వల్ల వారికున్న వనరులు పరిమితంగా ఉండడం వల్ల వారిపై ఒత్తిడి పెరిగింది. చాలామంది లబ్దిదారులు నమోదు చేసుకోలేకపోయారు. దీనిని గమనించి తమరు ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా రూ. 20 వేల లోపు లబ్దిదారులకు ఇచ్చే సమయంలో ఇస్తామన్నారు. దీనిపై గౌరవ హైకోర్టు పర్యవేక్షణలో గ్రామ, వార్డు వలంటీర్లను ఉపయోగించుకుని ఎంపీడీవోల ద్వారా ఐడెంటీఫై చేసి వారికి రిలీఫ్‌ ఇస్తామని కోర్టును కోరగా వారు అనుమతిచ్చారు. దాదాపు 1.80 లక్షల మంది వలంటీర్లు ఎన్యూమరేషన్‌లో పాల్గొన్నారు, వారంతా గడప గడపకూ వెళ్ళి అగ్రిగోల్డ్‌ బాధితుల డేటాను సేకరించారు. అప్పుడు చాలామంది బాధితులు మేం గతంలో కూడా ఇచ్చాం కానీ మాకు న్యాయం జరగలేదు అన్నారు, కానీ మీరు మా ఇంటికే వచ్చి అడుగుతున్నారు అన్నారు, ఆ తర్వాత వెరిఫికేషన్‌ ఎంపీడీవోల కార్యాలయంలో జరిగింది, డేటా బేస్‌ ఏర్పడిన తర్వాత పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టి పారదర్శకంగా చేశాం, ఎవరూ మిగిలిపోకుండా ప్రతీ బాధితుడిని ఎన్యూమరేట్‌ చేశాం, అధికారులంతా సహకరించారు. టెక్నాలజీ వాడుకొని రూ. 200 కోట్ల అదనపు ప్రాపర్టీని గుర్తించడం జరిగింది, దీనిని హోం సెక్రటరీ ద్వారా అటాచ్‌మెంట్‌ ఆర్డర్‌ తీసుకురావడం జరిగింది. ధ్యాంక్యూ వెరీ మచ్‌ సార్‌.

  చాలా క్షోభకు గురయ్యాను: చంద్రశేఖర్‌రావు, వాచ్‌ మెకానిక్, అగ్రి గోల్డ్‌ బాధితుడు, శ్రీకాకుళం 

సార్‌ నేను వాచ్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాను, నేను ఐదేళ్ళ క్రితం అగ్రి గోల్డ్‌లో రూ. 18,450 కట్టాను, కానీ కొది రోజుల తర్వాత ఆ సంస్ధ ఎత్తేశారు అని పేపర్‌లో చూసి చాలా క్షోభకు గురయ్యాను. రూపాయి రూపాయి దాచుకున్న డబ్బు పోయిందని బాధపడ్డాను, క్యాంప్‌లకు వెళ్ళి గంటల కొద్ది నిలుచునేవాడిని, అయినా పని జరగలేదు. కానీ మీరు పాదయాత్రలో నాలాంటి బాధితులను ఆదుకుంటామన్నారు, ఆ మాట ప్రకారం మీరు గెలిచిన తర్వాత మాకు 2019లో మొదటి విడతగా రూ. 10 వేల లోపు వారికి ఇచ్చారు, ఇప్పుడు మా వంతు వచ్చింది, నేను రూ. 20 వేల లోపు బాధితుడిని. నా అకౌంట్‌లో నేరుగా డబ్బు వేస్తారని మా వలంటీర్‌ చెప్పారు, వలంటీర్‌ అప్లికేషన్‌ నింపింది, మేం దాచుకున్న డబ్బు పోయిందనుకున్నాం కానీ మీరు మాకు న్యాయం చేశారు. ఇది చరిత్ర సార్‌. ఒక ప్రైవేట్‌ కంపెనీలో డబ్బు పెట్టి దివాళా తీస్తే ఒక ప్రభుత్వం బాధ్యత తీసుకుని మీరు న్యాయం చేయడం సంతోషకరం. నాకు ఇద్దరు పిల్లలు, వారికి అమ్మ ఒడి వచ్చింది, ఇంటి స్ధలం కూడా వచ్చింది, చాలా సంతోషంగా ఉంది సార్, మీరే ఎప్పడూ సీఎంగా ఉండాలి సార్, నేను ఏపీలో పుట్టినందుకు సంతోషంగా ఉంది. నేను చాలా గర్వపడుతున్నాను సార్, నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను సార్, ఉన్నవారికి ఈ డబ్బు చాలా తక్కువ అవ్వచ్చు కానీ నాలాంటి పేదవాడికి ఇది చాలా ఎక్కువే సార్, మేం అంతా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళం, ఎవరూ మాకు న్యాయం చేయలేదు, మా కష్టం అంతా వృధా అయిందని బాధపడ్డాం, కానీ మీరు మాకు న్యాయం చేశారు, చాలా చాలా సంతోషంగా ఉంది సార్‌. 

 మీరు సీఎం అయ్యాక మాకు నమ్మకం కుదిరింది: బొప్పూడి ఉషారాణి, అగ్రి గోల్డ్‌ బాధితురాలు, మాచర్ల మండలం, గుంటూరు జిల్లా 

సార్‌ నా భర్త డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నారు, రూపాయి రూపాయి కూడబెట్టి మా పిల్లల భవిష్యత్‌ మాలాగా ఉండకూడదని విచారించి అగ్రి గోల్డ్‌లో పెట్టుబడి పెడితే ఎక్కువ వడ్డీ వస్తుందని మేం నెలనెలా పొదుపు చేశాం, మా ఆశలన్నీ అడియాశలు అయ్యాయి, గత ప్రభుత్వంలో ఎందరినో కలిసి మా కష్టం చెప్పుకున్నాం, రోడ్లెక్కి ఆందోళనలు చేశాం, అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఆ డబ్బు కోసం నేను ఏడాదిన్నర తిరిగాను, కానీ మీరు సీఎం అయిన తర్వాత మొదటి విడతలో రూ. 10 వేల లోపు వారికి ఇచ్చారు, మాకు నమ్మకం కుదిరింది, ఇప్పుడు నేను జమ చేసిన రూ. 15 వేలు ఇస్తున్నారు, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్‌. అంతేకాదు మీ ద్వారా నా పిల్లలను రెండేళ్ళుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు, వారికి అన్నీ కూడా అందుతున్నాయి, వారు సంతోషంగా ఉన్నారు. మేం కార్పొరేట్‌ స్కూల్‌లో చదివినట్లు చదువుతున్నామని మా పిల్లలు సంతోషంగా చెబుతున్నారు, మా అత్తయ్య పెన్షన్‌ కూడా ఇంటికే వస్తుంది, మీరు తండ్రికి తగ్గ తనయుడు అంటారు కానీ మీరు తండ్రిని మించిన తనయుడిగా మిమల్ని తీర్చిదిద్దిన తల్లిగారు విజయమ్మ గారికి, వదినమ్మ భారతి గారు సహకారంతో మీ అండదండలతో మాలాంటి పేదలకు న్యాయం చేస్తున్నందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అన్నా. నేను చాలా కష్టపడి దాచుకున్న డబ్బు రాదనుకున్నాం కానీ మీరు మా అన్నయ్యలా తోడుండి మాకు న్యాయం చేశారు. మా పిల్లలు వారి మేనమామగా మీరే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారు సార్‌. 

 తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు: విశాలాక్షి, అగ్రి గోల్డ్‌ బాధితురాలు, కర్నూలు 

అన్నా నేను చిరువ్యాపారిని, నేను అగ్రి గోల్డ్‌లో నెలకు రూ. 500 చొప్పున జమ చేస్తూ రూ. 11,500 జమ చేశాను, కానీ తర్వాత మూత బడేసరికి చాలా బాధపడ్డాను, ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన దగ్గరికి చాలాసార్లు ఫిర్యాదు చేశాం, రోడ్లెక్కి ధర్నాలు చేశాం, కానీ ఎవరూ సాయం చేయలేదు, మేం మా డబ్బు రాదనుకున్నాం, మీరు పాదయాత్ర చేస్తున్న సమయంలో మా సమస్యను చెప్పుకున్నాం. మీరు సీఎంగా అవగానే వలంటీర్‌ మా ఇంటికి వచ్చి అన్ని వివరాలు తీసుకున్నారు, మా అకౌంట్‌లలో మా డబ్బు మాకు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. మీరు అన్నమాట నిలబెట్టుకుని తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు. ప్రైవేట్‌ సంస్ధను మీరు చేతుల్లోకి తీసుకుని మా డబ్బు మాకు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ రాఖీ పండుగకు మీరు మాకు ఇచ్చిన కానుకగా మేం చాలా సంతోషంగా ఉన్నాం. మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి. మా బాబుకు అమ్మ ఒడి వచ్చింది, నేను వివిధ స్కీమ్స్‌ ద్వారా లబ్దిపొందాను, ఏ ప్రభుత్వం ఆలోచించని విధంగా మీరు ఆలోచించారు, మీ కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నా.

Back to Top