ప్రభుత్వంపై లోకేష్‌ దుష్ప్రచారం చేస్తున్నాడు

హోంశాఖ మంత్రి సుచరిత
 

అమరావతి: రాష్ట్రంలో హత్యలంటూ లోకేష్‌ దుష్ప్రచారం చేస్తున్నారని హోంశాఖ మంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలో కుటుంబ కారణాలతో హత్య జరిగితే దాన్ని ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. లోకేష్, టీడీపీ నేతలు ఉనికి కోసం పాకులాడుతున్నారని, టీడీపీ కార్యకర్తలే వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 57 మంది వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలపై దాడులు చేశారన్నారు. అక్రమ నిర్మాణాలు తొలగిస్తే లోకేష్, టీడీపీ నేతలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top